నేడు రెండో విడుత నోటిఫికేషన్

  హైదరాబాద్: రెండో విడత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ రెండో విడత ఎన్నికల్లో 31 జిల్లాల నుంచి ఎంపిటిసి 1913, జడ్పిటిసి 180 స్థానాలకు ఈ రోజు 10:30 గంటల నుంచి ఏప్రిల్ 28 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 29వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగగా.. 30న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం […] The post నేడు రెండో విడుత నోటిఫికేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రెండో విడత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ రెండో విడత ఎన్నికల్లో 31 జిల్లాల నుంచి ఎంపిటిసి 1913, జడ్పిటిసి 180 స్థానాలకు ఈ రోజు 10:30 గంటల నుంచి ఏప్రిల్ 28 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 29వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగగా.. 30న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించి, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి, గుర్తులను కేటాయిస్తారు. మే 2 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకొనే అవకాశం కల్పించింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 27న ఫలితాలను వెల్లడిస్తారు. ప్రతి మండలంలో జెడ్పిటిసి స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, మూడు ఎంపిటిసి స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఎంపిటిసి అభ్యర్థులు ఆర్డీవొలకు, సబ్ కలెక్టర్లకు, జెడ్పిటిసి అభ్యర్థులు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

Parishad elections second phase notification release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు రెండో విడుత నోటిఫికేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: