మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం…

మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలించిన మహరాష్ట్ర బృందం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు బేషుగ్గా ఉందంటూ కితాబు ఇదే తరహలో తమ వద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్న అధికారులు కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే దిశానిర్థేశం చేసేదిగా ఉందని మహరాష్ట్ర అధికారుల బృందం సభ్యులు కితాబిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద ఉన్న మిషన్ భగీరథ పథకాన్ని ఆ మహరాష్ట్ర జీవన్ ప్రాదీకారణ్ […] The post మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలించిన మహరాష్ట్ర బృందం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు బేషుగ్గా ఉందంటూ కితాబు
ఇదే తరహలో తమ వద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్న అధికారులు

కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే దిశానిర్థేశం చేసేదిగా ఉందని మహరాష్ట్ర అధికారుల బృందం సభ్యులు కితాబిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద ఉన్న మిషన్ భగీరథ పథకాన్ని ఆ మహరాష్ట్ర జీవన్ ప్రాదీకారణ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి పి.వెల్స్రు, చీఫ్ ఇంజనీర్ చంద్రకాంత్‌గుజ్‌బాయ్‌లతో కూడిన బృందం పరీశీలించింది. ప్రాజెక్టు వద్ద నీటి లభ్యత, పంపింగ్, మోటార్ల కేపాసిటీ, పంపింగ్, నీటి శుద్ది తదితర వాటిని పరిశీలించారు. అంతకుముందు ఎస్‌ఈ చెన్నారెడ్డి, ఈఈ సింగ్, శ్రీధర్‌రావులతో కూడిన రాష్ట్ర అధికారుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎక్జిబీషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దాహర్థి తీర్చేందుకు దేశంలో ఎక్కడా చేయని సాహసోపేత నిర్ణయాన్ని తీసుకొని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు అందించేలా ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు వారు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోని బ్యాక్ వాటర్ ద్వారా నీటిని సేకరించి వాటిని ఎల్లూరు వద్ద ఏర్పాటు చేసిన పిల్టర్‌బెడ్ల ద్వారా శుద్ది చేసి పైపుల ద్వారా పరిసర గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే గుడిపల్లి వద్ద ఇదే తరహలో మరో ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు ద్వారా సేకరించిన నీటిని 12 మోటర్ల ద్వారా పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. వాటికి సంబందించిన స్వీచ్ యార్డును వారికి వివరించారు. ఇక్కడి ప్రాజెక్టులో ఎంత మంది పనిచేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, వంటి వివరాలను సైతం ఆ రాష్ట్ర అధికారులు అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడి మోటార్ల ద్వారా గుడిపల్లి రిజర్వాయర్ వద్దకు నేరుగా పైపుల ద్వారా పంపింగ్ చేస్తునట్లు తెలిపడంతో ఆశ్చర్యంగా వాటి వివరాలను అడిగి తెలసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం బేషుగ్గా ఉందని ఇక్కడి ఇంజనీర్ల పనితీరు బాగుందని ఇదే తరహలో తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, ఇక్కడి సాంకేతికత, పనుల తీరు బాగుందన్నారు.

ఇలాంటి పథకాలను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే త్రాగు నీటి సమస్య తీరుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ, అధికారుల పనితీరు బాగుందంటూ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర అధికారులు సిఈ విజయ్‌గట్కర్, ఎస్‌ఈ అజయ్‌సింగ్, ఈఈ గవాన్‌కార్ రాష్ట్ర అధికారులు ఈఈ అంజత్‌అలీ, ఏఈ మల్లేశ్వరావు, నవీన్ తదితరులున్నారు.

Maharashtra Team Examining Mission Bhagiratha Scheme

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: