అటవీ ఉత్పత్తులే జీవనాధరం…

80 కుటుంబాలు చీపుర్లు, తునికాకు సేకరణ… అటవీ ఉత్పత్తులే జీవనాధరం అంటున్న వెంకటపురం గామస్తులు ఆళ్లపల్లి: ఇళ్లు వాకిళ్లని శుభ్రం చేసే చీపురే భద్రాద్రి జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి జీవనాధారమైంది. వ్యవసాయం చేయడానికి సాగునీరు లేదు, చెరువులు, కుంటలు అసలే లేవు… వర్షాభావ పరిస్థితుల్లో పండించిన పంటలకు దిగుబడి రావడం లేదు. పెట్టిన పెట్టుబడులు తీరడం లేదు. దీంతో నిరాశ చెందకుండా గిరిజనులు అటవీ ఉత్పత్తులనే జీవనాధారం చేసుకుంటున్నారు. ప్రతి ఏటా వ్యవసాయ పనులతో పాటు […] The post అటవీ ఉత్పత్తులే జీవనాధరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
80 కుటుంబాలు చీపుర్లు, తునికాకు సేకరణ… అటవీ ఉత్పత్తులే జీవనాధరం అంటున్న వెంకటపురం గామస్తులు

ఆళ్లపల్లి: ఇళ్లు వాకిళ్లని శుభ్రం చేసే చీపురే భద్రాద్రి జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి జీవనాధారమైంది. వ్యవసాయం చేయడానికి సాగునీరు లేదు, చెరువులు, కుంటలు అసలే లేవు… వర్షాభావ పరిస్థితుల్లో పండించిన పంటలకు దిగుబడి రావడం లేదు. పెట్టిన పెట్టుబడులు తీరడం లేదు. దీంతో నిరాశ చెందకుండా గిరిజనులు అటవీ ఉత్పత్తులనే జీవనాధారం చేసుకుంటున్నారు. ప్రతి ఏటా వ్యవసాయ పనులతో పాటు చీపుర్లు, తునికాకు, ఉసిరి, ఇప్పపువ్వు తదితర అటవీ వనరుల సేకరణ ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని వెనుకేసుకుంటున్నారు. ముఖ్యంగా 80 కుటుంబాలు చీపుర్లు ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అయితే కొంతకాలంగా ఆడవులను నరకడం, కాల్చడంతో ఈ వనరులు దూరం అవుతున్నాయని వెంకటాపురం గామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీరు లేక : మండలంలోని ఆళ్లపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో చెరువులు, కుంటలు అసలే లేవు, దీంతో వారు వర్షాకాలంలో పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలను సాగు, చేస్తారు. కానీ ఆశించినంత పంట చేతికందదు. దీంతో పెట్టిన పెట్టుబడులు అప్పులు గానే మిగులుతున్నాయి. అప్పులున్నాయని ఏనాడు దిగులు చెందలేదు. అడవి తల్లిని నమ్ముకున్నారు. చీపుర్లే వారి చింతలు తీర్చుతున్నాయి. ఆ గ్రామ గిరిజనులంతా తునికాకు, చీపుర్లపైనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయం మొదటి పంట అయితే వీటిని రెండో పంటగా భావిస్తారు.

ఎక్కువ ఆదాయం సమకూర్చే చీపురు : తెల్లవారుజామున్నే నీళ్లబుర్ర, చేతిలో కొడవలి పట్టుకుని ఇంటిళ్లిపాది కాలి నడకన అడవికి పయనమవుతారు. చీపురు గడ్డిని కోసి పెద్దపెద్ద మోపులు కట్టుకుని ఇంటికి తిరిగి వస్తారు. కోసిన గడ్డికి ఉన్న ముళ్లను దులిపి ఆరబెడతారు. ఆరిపోయిన ఆ గడ్డిని మళ్లీ మోపులుగా కట్టుకడతారు. కెజి చీపురు రూ.36 చొప్పున స్థానిక జిసిసిలలో కొనుగోలు చేస్తారు. ప్రైవేట్ వ్యాపారులే వారి వద్దకు వచ్చి కెజి చీపురు రూ.45 నుంచి రూ.55 వరకు ఒక్కో చీపురు కట్ట రూ.15 చొప్పునఅమ్ముతారు. దీంతో గిరిజనులకు జిసిసి కంటే ఎక్కువ అదాయం ప్రైవేటుగానే సమకూరుతుంది.

ప్రతీ ఏటా అక్టోబర్ నుంచి సేకరించిన చీపుర్లను ఒక్కసారిగా ఏప్రిల్ నెలలో అమ్ముతుంటారు. ప్రతీ ఏడాది ఒక్కో కుటుంబం రూ.25 నుంచి రూ.30వేల వరకు ఆదాయం వస్తుందని వారు వాపోతున్నారు. దీని తర్వాత తునికాకు కోతలు ప్రారంభిస్తారు. దీంతో మరికొంత ఆదాయం వస్తుంది. ముందుగా పోడు భూముల్లో మోడేల ఆకులతో పాటు గుట్టల పైన ఉన్న ఆకులను సైతం సేకరిస్తారు. ఏప్రిల్, మే నెలలో సేకరించే ఈ తునికాకు సేకరణతో ఒక్కో కుటుంబం రూ.20 వేలకు పైగానే ఆదాయాన్ని వెనకేసుకుంటారు. విద్యార్థులు సైతం సెలవు రోజుల్లో సేకరణకు వెళ్తుంటారు. అటవీ శాఖాధికారులు ఇచ్చే బోనస్‌లు సైతం చేతి ఖర్చులకు అందుతుందన్నారు.

అటవీ ఉత్పత్తులే జీవనాధారం: చాలా సంవత్సరాల నుంచి తామంతా అటవీ ఉత్పత్తులైన చీపుర్లు, తునికాకు, విప్పపువ్వులను సేకరిస్తూ జీవిస్తునామని గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామంలో సాగునీరు లేక వ్యవసాయంలో ఆశించినంత దిగుబడులు రావడం లేదని దీంతో తమ ప్రాంతంలో విరివిగా లభించే చీపురు గడ్డి, తునికాకు తదితర వనరులపై ఆధారపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఏడాది మొత్తం కష్టపడితే పెట్టుబడులు కాగా రూ.55 వేలు కూడా రావని, అడవి తల్లిని నమ్ముకుంటే నాలుగు నెలల్లోనే రూ.55 వేల ఆదాయం వస్తుందని అంటున్నారు. అయితే ఇటీవల అడవులను నరకడం, కాల్చడం వల్ల ఆ వనరులు దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిసిసిలలో కోనుగోలు చేసే ఈ అటవీ ఉత్పత్తులకు రేట్లు పెంచాలని ఆ గ్రామప్తులు కోరుతున్నారు.

 

bhadradri tribals sustainable with forest products

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అటవీ ఉత్పత్తులే జీవనాధరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: