వైసిపిలోకి రమ్మన్నారు… : లక్ష్మీనారాయణ

హైదరాబాద్ : వైసిపిలో చేరాలని ఆ పార్టీనేత విజయసాయిరెడ్డి తనను కోరారని సిబిఐ మాజీ జెడి, జనసేన నేత లక్ష్మీనారాయణ తెలిపారు. జగన్ కేసు విచారణ వృత్తి పరంగా చేశారని, రాజకీయాలు వేరని, ఈ క్రమంలోనే వైసిపిలో చేరాలని విజయసాయిరెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పారని ఆయన పేర్కొన్నారు. తాము ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నామని, ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేశారని, గతంలో జరిగింది పక్కనబెట్టి వైసిపిలో చేరాలని ఆయన తనను కోరారని లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయాల్లో […] The post వైసిపిలోకి రమ్మన్నారు… : లక్ష్మీనారాయణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : వైసిపిలో చేరాలని ఆ పార్టీనేత విజయసాయిరెడ్డి తనను కోరారని సిబిఐ మాజీ జెడి, జనసేన నేత లక్ష్మీనారాయణ తెలిపారు. జగన్ కేసు విచారణ వృత్తి పరంగా చేశారని, రాజకీయాలు వేరని, ఈ క్రమంలోనే వైసిపిలో చేరాలని విజయసాయిరెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పారని ఆయన పేర్కొన్నారు. తాము ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నామని, ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేశారని, గతంలో జరిగింది పక్కనబెట్టి వైసిపిలో చేరాలని ఆయన తనను కోరారని లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల నుంచి ఆహ్వానం రావడం సాధారణమేనని, అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పలు రకాల ఆలోచనలతో ఉన్న పార్టీలు సంప్రదిస్తాయని, అయితే తన ఆలోచనలకు సరిపోను వ్యక్తులతోనే కలిసి పని చేస్తానని తాను ఎప్పుడో చెప్పానని ఆయన గుర్తు చేశారు.

CBI Ex JD Lakshmi Narayana Comments on YCP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వైసిపిలోకి రమ్మన్నారు… : లక్ష్మీనారాయణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: