సమస్యలు పరిష్కరించడానికి బస్తీలు తిరుగుతా: తలసాని

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బస్తీలు, కాలనీలు తిరుగుతా… మంత్రి తలసాని హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మారేడుపల్లిలోని తన నివాసంలో కార్పోరేటర్లు, టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… సనత్ నగర్ నియోజకవర్గంలోని ప్రజాసమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. అయినప్పటికి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించడానికి శని,ఆదివారాల్లో బస్తీలు, కాలనీలల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానన్నారు. […] The post సమస్యలు పరిష్కరించడానికి బస్తీలు తిరుగుతా: తలసాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బస్తీలు, కాలనీలు తిరుగుతా… మంత్రి తలసాని

హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మారేడుపల్లిలోని తన నివాసంలో కార్పోరేటర్లు, టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… సనత్ నగర్ నియోజకవర్గంలోని ప్రజాసమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.

అయినప్పటికి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించడానికి శని,ఆదివారాల్లో బస్తీలు, కాలనీలల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానన్నారు. నియోజకవర్గంలో ఉన్న కార్పోరేటర్లు, నాయకులు, కార్యకర్తలు బస్తీలల్లో నిత్యం తిరుగుతూ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను అధ్యయనం చేయాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొన్ని పనులు పూర్తి కాలేవన్నారు. వాటిని కూడ త్వరలో పరిష్కరిస్తానని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో కార్పోరేటర్లు నామన శుషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, ఉప్పల వెంకటేష్,హేమలత, టిఆర్‌ఎస్ నాయకులు కూడ వెంకటేష్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Talasani Srinivas Yadav Meeting With TRS Activists

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సమస్యలు పరిష్కరించడానికి బస్తీలు తిరుగుతా: తలసాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: