గ్యాస్ లీకేజీతో గుడిసె దగ్దం…

  ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని సోమలగడ్డ గ్రామంలో ఉదయం 7.30 నుండి 8.00 గంటల సమయంలో నరిగే యాదయ్య కేతమ్మ దంపతుల గడ్డి ఇల్లు ఖాళీ దగ్దమైంది. ప్రమాదానికి గల కారణం విశ్లేషించగా యాదయ్య దంపతులు ఇరువురు ఉదయం 6 గంటలకే ఉపాధి హామీ పథకం కూలీ పనికి వెళ్లేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేయకుండా వెళ్లడంతో  గ్యాస్ మొత్తం లీక్ అయ్యి గ్యాస్ బండ పేలి ఉవ్వెత్తున మంటలు ఎగిసి […] The post గ్యాస్ లీకేజీతో గుడిసె దగ్దం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని సోమలగడ్డ గ్రామంలో ఉదయం 7.30 నుండి 8.00 గంటల సమయంలో నరిగే యాదయ్య కేతమ్మ దంపతుల గడ్డి ఇల్లు ఖాళీ దగ్దమైంది. ప్రమాదానికి గల కారణం విశ్లేషించగా యాదయ్య దంపతులు ఇరువురు ఉదయం 6 గంటలకే ఉపాధి హామీ పథకం కూలీ పనికి వెళ్లేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేయకుండా వెళ్లడంతో  గ్యాస్ మొత్తం లీక్ అయ్యి గ్యాస్ బండ పేలి ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దీని ద్వారా వారి గడ్డి, గుడిసె ఇల్లు కాలీ దగ్దమైందని బాధితులు తెలిపారు. ఇంటి లోపల ఉన్న సామానులు మొత్తం కాలి బూడిద అయ్యాయి. విఆర్వో షరీఫ్ ప్రమాద ఘటనను విశ్లేషించి సుమారు రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. కాగా గ్రామస్థులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

 

Hut burned with gas leakage

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్యాస్ లీకేజీతో గుడిసె దగ్దం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: