పత్తాలేని తపాల కార్యాలయం…

* రోడ్డు పైనే లేటర్‌లు, * స్పందించని పోస్ట్‌మెన్, * ఇబ్బందులు పడుతున్న ప్రజలు హయత్‌నగర్‌ః మూడు గ్రామాలకు కలిపి ఒక తపాల కార్యాలయం ఉండేది. కానీ ఇప్పుడు అది కనుమరుగైపోయింది. ఉత్తరాలు వచ్చినవారు తీసుకునేందుకు రోడ్డుపై చెత్తకుప్పలా పడివున్నా వాటిలో వేతుకోవల్సిందే. నేల క్రితం వచ్చిన ఉత్తరాలు కూడ ఇంటికి చేరుకోవు. పైగా పోస్ట్‌మెన్ ఫోన్ చేస్తే స్పందన ఉండదు ఎవ్వరికి చేప్పుకొవాలో అర్దం కాదు. ఈ జరిగే తంతూ నగర శివారుకు కూత వేటు […] The post పత్తాలేని తపాల కార్యాలయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
* రోడ్డు పైనే లేటర్‌లు,
* స్పందించని పోస్ట్‌మెన్, * ఇబ్బందులు పడుతున్న ప్రజలు

హయత్‌నగర్‌ః మూడు గ్రామాలకు కలిపి ఒక తపాల కార్యాలయం ఉండేది. కానీ ఇప్పుడు అది కనుమరుగైపోయింది. ఉత్తరాలు వచ్చినవారు తీసుకునేందుకు రోడ్డుపై చెత్తకుప్పలా పడివున్నా వాటిలో వేతుకోవల్సిందే. నేల క్రితం వచ్చిన ఉత్తరాలు కూడ ఇంటికి చేరుకోవు. పైగా పోస్ట్‌మెన్ ఫోన్ చేస్తే స్పందన ఉండదు ఎవ్వరికి చేప్పుకొవాలో అర్దం కాదు. ఈ జరిగే తంతూ నగర శివారుకు కూత వేటు దూరంలో ఉన్నా తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్, బ్రహ్మణపల్లి, మునుగనూర్ గ్రామాలలో సాక్షత్కరిస్తుంది. మూడు గ్రామాలకు కలిపి పోస్ట్ కార్యాలయం గతంలో తొర్రూర్ గ్రామంలో ఉండేది.

కానీ కోన్ని కారణాల వల్ల ఇప్పుడు మునుగనూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు. కేవలం మునుగనూర్ గ్రామంలో తపాల కార్యాలయం అని పేరు తప్ప , ఎక్కడ కూడ కనిపించదు.ఉత్తరాలు మాత్రం గ్రామ పంచాయతీ కార్యాలయ అవరణలో ఒక చేట్టు క్రింద పడి ఉంటాయి. వచ్చిన వారు వారి పేర్లను గుర్తుపట్టి వేతుక్కోవాలి. వాటిని చేరావేసే పోస్ట్‌మెన్ ఇంటింటికి అందించకుండ చేట్టు క్రిందకు పార వేస్తాడు. ఉత్తరాలు వచ్చిన వారు వేతుకోవల్సిందే.

అదె ఏమిటని ప్రశ్నిస్తే పని భారం ఎక్కువగా ఉందని మీ ఉత్తరాలు మీరు తీసుకెళ్లండి అని సమదానం ఉంటుందని ప్రజలు తెలుపుతున్నారు. ఇదీలావుండగా అయా గ్రామాల ఉత్తరాలు విలువైన వాహణాల అర్‌సీ కార్డులు, బ్యాంక్ చెక్ బుక్కులు, పాస్‌పోర్ట్‌లు విలువైన ఉత్తరాలు చేట్టు క్రింద దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి ఉత్తరాలకు ప్రత్యమ్నయ చర్యలు తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు.

పని భారం వల్ల ఉత్తరాలు ఇంటింటికి చేరవేయడంలో జాప్యం…

బిబిఎం గోపి కృష్ణను తపాల పనితనం పై ప్రశ్నిస్తే పని భారం వల్ల నెలకు 15 రోజులు పేన్షన్‌లు అందిచడమే సమయం సరిపోతుందని కోన్ని కాలనీలలో ఇంటి నెంబర్‌లు లేక ఉత్తరాలు ఇంటింటికి చేరవేయడంలో తనకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని తెలిపారు.

people suffering with Turkayamjal post office negligence

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పత్తాలేని తపాల కార్యాలయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: