ఇంగ్లండ్, ఇండియా కంటే మా జట్టే ఫేవరేట్: సర్ఫరాజ్

లాహోర్: 2019 ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ తోపాటు టీమిండియాలకే టైటిల్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని అందరూ అంటున్నారని, కానీ పాకిస్తాన్ జట్టే ఫేవరేట్ అన్నాడు ఆ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడమే తమ జట్టుకు కలిసొచ్చే అంశమని పాక్ కెప్టెన్ పేర్కొన్నాడు. దీంతో తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, దాంతో తమ ఆటగాళ్లు చక్కగా రాణిస్తారని సర్ఫరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెడితే […] The post ఇంగ్లండ్, ఇండియా కంటే మా జట్టే ఫేవరేట్: సర్ఫరాజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లాహోర్: 2019 ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ తోపాటు టీమిండియాలకే టైటిల్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని అందరూ అంటున్నారని, కానీ పాకిస్తాన్ జట్టే ఫేవరేట్ అన్నాడు ఆ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడమే తమ జట్టుకు కలిసొచ్చే అంశమని పాక్ కెప్టెన్ పేర్కొన్నాడు. దీంతో తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, దాంతో తమ ఆటగాళ్లు చక్కగా రాణిస్తారని సర్ఫరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెడితే తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని… అది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నాడు. ఇక ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయని, వారు ఒత్తిడికి లోను కావడం ఖాయమని చెప్పాడు. తద్వారా 2019 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ కంటే పాకిస్తాన్ జట్టే హాట్ ఫేవరేట్ అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ అన్నింటీలోనూ భారత్‌పై పాక్ విజయం సాధించలేద. అయితే ఈసారి ఇండియాతో జరిగే మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని, ఆ సెంటిమెంట్ ను తిరగరాసి మా జట్టే గెలుస్తుందని పాక్ కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్ లో రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచ్‌లు జరుగునున్న నేపథ్యంలో టోర్నీలో ఎదుర్కొనే తొమ్మిది మ్యాచ్‌లు కూడా చాలా ముఖ్యమైనవని, ఏ జట్టుతో తలపడినా అది టీమిండియాతో ఆడినట్లుగానే భావిస్తామని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు.

Pakistan captain says being an underdog eases the pressure on the team

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇంగ్లండ్, ఇండియా కంటే మా జట్టే ఫేవరేట్: సర్ఫరాజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: