విద్యార్థులందరికి న్యాయం జరుగుతుంది: జగదీష్ రెడ్డి

  సూర్యాపేట: ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కవగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు, అపోహలు నమ్మొద్దని అందరికి న్యాయం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, అనుమానాలు ఉన్న వాళ్లు రీ వాల్యుయేషన్ కు అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. నిన్నటి వరకు 9 వేల అప్లికేషన్లు వచ్చాయని, ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చన్నారు. […] The post విద్యార్థులందరికి న్యాయం జరుగుతుంది: జగదీష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూర్యాపేట: ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కవగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు, అపోహలు నమ్మొద్దని అందరికి న్యాయం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, అనుమానాలు ఉన్న వాళ్లు రీ వాల్యుయేషన్ కు అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. నిన్నటి వరకు 9 వేల అప్లికేషన్లు వచ్చాయని, ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చన్నారు. రీ వెరిఫికేషన్ కు రూ. 600, రీ కౌంటింగ్ కు రూ. 100 చెల్లించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చాని సూచించారు. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ… సాఫ్ట్ వేర్ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతుందని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఒఎంఆర్ షీట్ లో తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకొవద్దన్నారు. పరీక్షలో ఫేయిలైతే మళ్లీ రాసుకొవచ్చు కాని, ప్రాణం పోతే మళ్లీ రాదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను  ఎప్పటికప్పడు గమనిస్తు ఉండాలని కోరారు. మూల్యాంకనంలో తప్పులు జరిగితే మీకు న్యాయం జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి 10 మంది విద్యార్థులకు స్వశక్తి సంఘం ఏర్పాటు చేస్తాం.. దీని ద్వారా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఒకరికొకరు చెప్పుకోవచ్చాని జనార్థన్ రెడ్డి వెల్లడించారు.

Jagadish Reddy promises action after committee inquiry

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విద్యార్థులందరికి న్యాయం జరుగుతుంది: జగదీష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: