ఆ సమయంలో కన్నీరు పెట్టుకున్నా

  టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ల లిస్టులో టాప్‌లో ఉన్న యంగ్ బ్యూటీ రష్మిక మందన్న. ‘ఛలో’ వంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విజయ్ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. మరోసారి విజయ్‌తో ఆమె నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రష్మిక ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి వెల్లడించింది. ఒక రోజు ఆమె షూటింగ్ […] The post ఆ సమయంలో కన్నీరు పెట్టుకున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ల లిస్టులో టాప్‌లో ఉన్న యంగ్ బ్యూటీ రష్మిక మందన్న. ‘ఛలో’ వంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విజయ్ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. మరోసారి విజయ్‌తో ఆమె నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రష్మిక ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి వెల్లడించింది. ఒక రోజు ఆమె షూటింగ్ లొకేషన్‌కు ఆలస్యంగా వెళ్లిందట. అప్పుడు సినిమా యూనిట్ సభ్యులు ఎవరూ తనతో సరిగా మాట్లాడలేదట. అలా అందరూ ముభావంగా ఉండడంతో ఏం జరిగిందో అర్థం కాలేదని… ఇబ్బంది అనిపించి కన్నీరు పెట్టుకున్నానని రష్మిక చెప్పింది. కాసేపటి తర్వాత దర్శకుడు పరశురామ్ తన దగ్గరకు వచ్చి పలకరించాడట. రష్మిక సహజంగా బాధపడుతున్నప్పుడు ఉండే హావభావాలను కెమెరాలో క్యాప్చర్ చేసేందుకు ఇలా అందరం కలిసి ఆటపట్టించామని ఆయన చెప్పాడట. ఈ సంఘటనను తన జీవితంలో మరచిపోలేనని రష్మిక మందన్న పేర్కొంది.

Rashmika mandanna in top at crazy heroines list

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ సమయంలో కన్నీరు పెట్టుకున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: