ఓటేసిన అన్నాహజారే …

ఢిల్లీ : సామాజికవేత్త  అన్నాహజారే తన ఓట  హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్‌నగర్‌ జిల్లాలోని రాలేగావ్‌ సిద్దిలో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్‌లో ఆయన ఓటేశారు. ఇదిలా ఉండగా వయనాడ్‌లో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్‌ బూత్‌లో ఇవిఎం పని చేయలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద  ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వయనాడ్ లో రీపోలింగ్ చేపట్టాలని  ఎన్ డిఎ  అభ్యర్థి తుషార్‌ వెల్లప్పల్లి డిమాండ్‌ చేశారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇక్కడి వయనాడ్ నుంచి పోటీ చేస్తుండడంతో […] The post ఓటేసిన అన్నాహజారే … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : సామాజికవేత్త  అన్నాహజారే తన ఓట  హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్‌నగర్‌ జిల్లాలోని రాలేగావ్‌ సిద్దిలో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్‌లో ఆయన ఓటేశారు. ఇదిలా ఉండగా వయనాడ్‌లో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్‌ బూత్‌లో ఇవిఎం పని చేయలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద  ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వయనాడ్ లో రీపోలింగ్ చేపట్టాలని  ఎన్ డిఎ  అభ్యర్థి తుషార్‌ వెల్లప్పల్లి డిమాండ్‌ చేశారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇక్కడి వయనాడ్ నుంచి పోటీ చేస్తుండడంతో రాజకీయ ప్రముఖుల దృష్టి సారించారు. మూడో విడత ఎన్నికల పోలింగ్ 14రాష్ట్రాలు, రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. మంగళవారం  ఉదయం 9 గంటల వరకు పలు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లో 9.35, కర్ణాటకలో 6.02, అసోంలో 12.36, గోవాలో 9.30, గుజరాత్‌లో 6.76, కేరళలో 6.57, మహారాష్ట్రలో 3.79, ఒడిశాలో 4.98, త్రిపురలో 4.28, యూపీలో 9.80, బెంగాల్‌లో 16.23, ఛత్తీస్‌ఘడ్‌లో 9.59 శాతం నమోదైంది. అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలను మినహా, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Anna Hazare Votes in Ahmednagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఓటేసిన అన్నాహజారే … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: