ఐపిఎల్ ఫైనల్ ఉప్పల్‌లోనే!

విశాఖలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు మహిళల మ్యాచ్‌లకు జైపూర్ ఆతిథ్యం   ముంబై: ఐపిఎల్ సీజన్12 ఫైనల్ సమరానికి హైదరాబాద్ వేదికగా నిలువనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ ఫైనల్ జరుగనుంది. అంతేగాక సాగర తీర నగరం విశాఖపట్నం కూడా రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ హైదరాబాద్, విశాఖ నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగడం ఖాయమని జాతీయ మీడియాలో […] The post ఐపిఎల్ ఫైనల్ ఉప్పల్‌లోనే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విశాఖలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు మహిళల మ్యాచ్‌లకు జైపూర్ ఆతిథ్యం

 

ముంబై: ఐపిఎల్ సీజన్12 ఫైనల్ సమరానికి హైదరాబాద్ వేదికగా నిలువనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ ఫైనల్ జరుగనుంది. అంతేగాక సాగర తీర నగరం విశాఖపట్నం కూడా రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ హైదరాబాద్, విశాఖ నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగడం ఖాయమని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఐపిఎల్ ఫైనల్ సమరం మే 12న జరగాల్సి ఉంది. ఈ ఫైనల్ పోరుకు చెన్నై నగరం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే తమిళనాడు క్రికెట్ సంఘం, ఐపిఎల్ నిర్వాహకులకు మధ్‌య స్టాండ్స్‌కు సంబంధించి వివాదం నెలకొంది. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) చెపాక్‌లోని ఐ, కె, కె. స్టాండ్స్ తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.

దీంతో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానం ఉప్పల్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయించారు. మే 7న చెన్నైలో క్వాలిఫయర్-1 జరుగుతుంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 విశాఖలో నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లను హైదరాబాద్‌లోనే నిర్వహించాలి. అయితే మే 6, 10, 14న తెలంగాణలో పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి.

దీంతో మ్యాచ్ నిర్వహించేందుకు తగినంత పోలీసు బలగాలు అందుబాటులో ఉండటం లేదు. భద్రత పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లను విశాఖకు తరలిస్తున్నారు. మే 8న ఎలిమినేటర్, మే 10న క్వాలిఫయర్2 మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా, మహిళలకు సంబంధించిన మ్యాచులన్నిటికీ జైపూర్ ఆతిథ్యం ఇస్తోంది. తొలి మ్యాచ్ మే 6న జరుగుతుంది. ఆ రోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ సంఘం నుంచి ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మహిళల టోర్నీలో ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్, వెలోసిటీ జట్లు పోటీపడనున్నాయి.

 

IPL Final Match in Uppal Stadium in Telangana

The post ఐపిఎల్ ఫైనల్ ఉప్పల్‌లోనే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: