మాజీ ఎంఎల్ఎ డెల్లా గాడ్ ఫ్రే కన్నుమూత

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నామినేటెడ్ ఎంఎల్ఎగా పని చేసిన డెల్లా గాడ్‌ఫ్రే(62) మంగళవారం  ఉదయం కన్నుమూశారు. గత వారం ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఎపి అసెంబ్లీకి ఆమె రెండుసార్లు ఎంఎల్ఎగా నామినేట్ అయ్యారు. 2004 వరకు ఆమె ఎంఎల్ఎగా కొనసాగారు.  అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆమె కృషి చేశారు.  డెల్లా మృతిపై తెలంగాణ సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల […] The post మాజీ ఎంఎల్ఎ డెల్లా గాడ్ ఫ్రే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నామినేటెడ్ ఎంఎల్ఎగా పని చేసిన డెల్లా గాడ్‌ఫ్రే(62) మంగళవారం  ఉదయం కన్నుమూశారు. గత వారం ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఎపి అసెంబ్లీకి ఆమె రెండుసార్లు ఎంఎల్ఎగా నామినేట్ అయ్యారు. 2004 వరకు ఆమె ఎంఎల్ఎగా కొనసాగారు.  అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆమె కృషి చేశారు.  డెల్లా మృతిపై తెలంగాణ సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలను కొనియాడారు. నగరంలోని గన్‌ఫౌండ్రీలో సెయింట్ జోసఫ్ కాతడ్రిల్‌లో బుధవారం మధ్యాహ్నం సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం నారాయణగూడ క్యాథలిక్ సిమెట్రీలో డెల్లా అంత్యక్రియలు నిర్వహిస్తారు. డెల్లా మృతిపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Ex Nominated MLA Della Godfrey Passes Away

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మాజీ ఎంఎల్ఎ డెల్లా గాడ్ ఫ్రే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: