రహానె శతకం వృథా

పంత్ ధనాధన్ ధావన్ మెరుపులు రాజస్థాన్‌కు ఢిల్లీ షాక్   జైపూర్: రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్‌లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పృథ్వీషా సమన్వయంతో ఆడగా, ధావన్ మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను […] The post రహానె శతకం వృథా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పంత్ ధనాధన్
ధావన్ మెరుపులు
రాజస్థాన్‌కు ఢిల్లీ షాక్

 

జైపూర్: రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్‌లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పృథ్వీషా సమన్వయంతో ఆడగా, ధావన్ మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన ధావన్ 27 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. షా 42 పరుగులు సాధించాడు. మరోవైపు రిషబ్ పంత్ అద్భుత ఆటతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పంత్ 36 బంతుల్లోనే 4 భారీ సిక్స్‌లు, మరోఆరు ఫోర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ ఖాతా తెరవకుండానే రనౌటయ్యాడు.

అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ అజింక్య రహానె ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న రహానె ఈ మ్యాచ్‌లో తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించాడు. చూడచక్కని షాట్లతో ముందుకు సాగాడు. మరోవైపు స్మిత్ కూడా మెరుగ్గా ఆడాడు. ఇద్దరు కూడా అద్భుతంగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు వేగంగా పరిగెత్తింది.

ఈ జోడీని విడగొట్టేందుకు ఢిల్లీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ రహానె, స్మిత్‌లు రాజస్థాన్‌ను పటిష్టస్థితికి చేర్చారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 32 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇదే సమయంలో రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్మిత్ ఔటైనా రహానె జోరును కొనసాగించాడు. స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ మరోసారి నిరాశ పరిచాడు. అతను 8 పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన ఆస్ట్రేలియా సంచలనం అష్టన్ టర్నర్ ఖాతా తెరవకుండాన ఔటయ్యాడు. మరోవైపు స్టువర్ట్ బిన్ని 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రహానె పోరాటం కొనసాగించాడు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన రహానె 63 బంతుల్లోనే 11 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో రాజస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 192 పరుగులకు చేరింది.

 

Delhi Capitals won by 6 Wickets on Rajasthan Royals

The post రహానె శతకం వృథా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.