చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఈ ములాఖత్…

చర్లపల్లి : జైలు సేవలలో పారదర్షకతను కల్పించడంతో పాటు ప్రజలకు మేరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ జైల్లశాఖ నూతన సంస్కరణలు ప్రవేశపెడుతుంది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఖైదీలకు, వారి బందువులకు సౌకర్యాలు కల్పిస్తుంది. రాష్ట్రంలోని సెంట్రల్ జైళ్లలో చర్లపల్లి కేంద్ర కారగారంలో సుమారుగా నిత్యం 17 వందల మంది ఖైదీలు, చంచల్‌గూడ 1500, వరంగల్ సెంట్రల్ జైలులో తొమ్మిది వందల మంది ఖైదీలు ఉంటారు. వేలాది మంది ఖైదీలు ఉండే సెంట్రల్ జైల్లలో ఉదయం 11 గంటల […] The post చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఈ ములాఖత్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చర్లపల్లి : జైలు సేవలలో పారదర్షకతను కల్పించడంతో పాటు ప్రజలకు మేరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ జైల్లశాఖ నూతన సంస్కరణలు ప్రవేశపెడుతుంది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఖైదీలకు, వారి బందువులకు సౌకర్యాలు కల్పిస్తుంది. రాష్ట్రంలోని సెంట్రల్ జైళ్లలో చర్లపల్లి కేంద్ర కారగారంలో సుమారుగా నిత్యం 17 వందల మంది ఖైదీలు, చంచల్‌గూడ 1500, వరంగల్ సెంట్రల్ జైలులో తొమ్మిది వందల మంది ఖైదీలు ఉంటారు. వేలాది మంది ఖైదీలు ఉండే సెంట్రల్ జైల్లలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంత మంది ఖైదీలను వారి బందువులు కలుసుకోగలరు. రాష్ట్రంలోని మూడు సెంట్రల్ జైల్లలో నిత్యం వందలాది మంది ఖైదీల బందువులు ములాఖత్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఖైదీల బందువులకు సకాలంలో ములాఖత్ అందించేందుకు తెలంగాణ జైళ్లశాఖ ప్రత్యేకంగా ఈ ములాఖత్‌ను ప్రారంభించింది.

తెలంగాణ జైళ్ల శాఖ ఈ ములాఖత్‌లపై మనతెలంగాణ ప్రత్యేక కధనం…
ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఖైదీలకు వారి బందువులుకు మేరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నూతన సంస్కరణలు చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్లపల్లి కేంద్ర కారాగారం, చంచల్‌గూడ సెంట్రల్‌జైలు, వరంగల్ సెంట్రల్ జైల్లలో సుమారుగా నిత్యం నాలుగు వేల మంది ఖైదీలు ఉంటారు. వీరికి తోడు నైజిరియ, సుడాన్, కాంగో వంటి ఆఫ్రికన్ దేశాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు చెందిన విదేశీ ఖైదీలు ఉన్నారు. నిత్యం మూడు సెంట్రల్ జైల్ల వద్ద ఖైదీల బందువులు ములాఖత్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. జైళ్ల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు ములాఖత్‌లో అవినీతిని తగ్గించేందుకు తెలంగాణ జైళ్లశాఖ దక్షణ భారతదేశంలో మొదటిసారిగా, దేశంలో తీహర్ జైలు తరువాత రెండవ రాష్ట్రంగా తెలంగాణలోని చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ సెంట్రల్ జైళ్లలో ఈ ములాఖత్‌లను 2017 ఫిబ్రవరి 25వ తేదిన రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ఈ ములాఖత్ ప్రారంభమై 26 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు 25 మంది మాత్రమే ఈ ములాఖత్‌ను వాడుకున్నారు. చర్లపల్లి, వరంగల్ జైల్లలో ఇప్పటికి ఒక్క ఈములాఖత్ చేసుకోలేదంటే ఎంత మందికి ఈములాఖత్ గురించి తెలుస్తుందొ ఇట్టే అర్ధం అవుతుంది.
పూర్తి స్తాయిలో ప్రచారం కల్పిస్తున్నం : ఐజి అకుల నర్సింహ్మ…
తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రధాన జైల్లు చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ సెంట్రల్ జైల్లలో సుమారుగా నిత్యం 500 మంది ఖైదీలను వారి బందువులు ములాఖత్‌లో కలుసుకుంటున్నారు. నిత్యం ఐదు వందల మందికి ములాఖత్‌లలో ఖైదీలను కల్పించేందుకు ఇబ్బంది కలుగుతుంది. దినికి తోడు ములాఖత్‌లలో అవినీతిని తగ్గించడంతో పాటు పారదర్షకతను చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వ అదేశాలతో జైళ్లశాఖ డీజి వినయ్‌కుమార్‌సింగ్ నేతృత్వంలో ఈ ములాఖత్‌ను ప్రారంభించాం. విదేశీ ఖైదీలు మినహయిస్తే ఈసౌకర్యాన్ని వినియోగించడం లేదని అన్నారు. ఈ ములాఖత్‌కు పూర్తి స్ధాయిలో ప్రచారం కల్పిస్తామని తెలిపారు.
ఈ ములాఖాత్ బక్ చేసుకోవడం ఎలా...
నిత్యం జైల్ల వద్ద వందలాది మంది ఖైదీల బందువులు ములాఖత్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతల నుంచి వచ్చేవారు అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చేసరికి ములాఖత్ టైం ముగిసిపోతుంది. దీంతో తమ వారిని కలిసేందు కోసం రాత్రంత జైలు వద్ద నిరిక్షించాల్సిన పరిస్ధితి నెలకొని ఉంది. ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఈ ములఖత్‌ను వాడుకోవాలని జైలు అధికారులు సూచిస్తున్నారు. ఈ ములాఖత్ బుక్ చేసుకునేవారు eprisons.nic.in సైటులోకి వెల్లి రాష్ట్రం, జైలు ఎంపిక చేసుకుని జైల్లో ఉన్న ఖైదీ పేరు తండ్రి పేరు యవస్సు పొందుపర్చాలి. దరఖాస్తు చేసుకునే వారి పేరు తండ్రి పేరు వారి అధార్ గుర్తింపు కార్డుతో పాటు వారు ములాఖత్‌కు వచ్చే తేదితో అప్లై చేసుకుంటే జైలుకు రెక్విస్టు వస్తుంది. దీన్ని జైలు అధికారులు నిర్ధారించగానే వారికి మేసేజ్ వస్తుంది. వచ్చిన మెసేజ్‌ను తీసుకుని జైలుకు వస్తే అప్పటికప్పుడే తమ బందువులను కలిపిస్తారు.

E-Mulakath at the Central jail in Charlapally

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఈ ములాఖత్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: