కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం

  ఆదిలాబాద్‌: మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం జిల్లా ఎస్ పి విష్ణు ఎస్ వారియర్ అందించారు. వివరాల్లోకి వెళ్లితే… ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలకొండ శ్రీనివాస్(50) గత సంవత్సరం ఏప్రిల్ 17న హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య పొలకొండ గంగామణి, ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో శ్రీనివాస్ […] The post కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్‌: మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం జిల్లా ఎస్ పి విష్ణు ఎస్ వారియర్ అందించారు. వివరాల్లోకి వెళ్లితే… ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలకొండ శ్రీనివాస్(50) గత సంవత్సరం ఏప్రిల్ 17న హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య పొలకొండ గంగామణి, ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత విభాగం జారీ చేసిన నాలుగు లక్షల విలువైన చెక్కును జిల్లా ఎస్ పి అందజేశారు. అనంతరం జిల్లా ఎస్పి మాట్లాడుతూ… శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, శాఖ పరంగా అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి అశోక్ కుమార్, పోలీసు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి వెంకటేశ్వర్లు, ప్రతినిధులు గిన్నెల సత్యనారాయణ, మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Financial Assistance to Constable Family in Adilabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: