నిర్వీర్యం చేస్తుండగా పేలిన బాంబు

  కొలంబో: శ్రీలంక మరో బాంబు పేలింది. భద్రతా సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేస్తుండగా పేలడంతో పలువురు గాయపడ్డారు. చర్చి వద్ద ఓ వాహనంలో బాంబు పేలినట్లు సమాచారం. కొలంబోలోని పెట్టా ప్రాంతంలోని ఓ బస్సు స్టేషన్ వద్ద 87 బాంబు డిటోనేటర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొలంబోలోని మరో బస్టాండ్ సమీపంలో 12 బాంబు డిటోనేటర్లు ఓ ప్రదేశంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడితే 75 […] The post నిర్వీర్యం చేస్తుండగా పేలిన బాంబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొలంబో: శ్రీలంక మరో బాంబు పేలింది. భద్రతా సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేస్తుండగా పేలడంతో పలువురు గాయపడ్డారు. చర్చి వద్ద ఓ వాహనంలో బాంబు పేలినట్లు సమాచారం. కొలంబోలోని పెట్టా ప్రాంతంలోని ఓ బస్సు స్టేషన్ వద్ద 87 బాంబు డిటోనేటర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొలంబోలోని మరో బస్టాండ్ సమీపంలో 12 బాంబు డిటోనేటర్లు ఓ ప్రదేశంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడితే 75 డిటోనేటర్లు లభ్యమయ్యాయి. ఇప్పటివరకు బాంబు పేలుళ్లలో 290 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బాంబు పేలుళ్లతో సంబంధమున్న 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ తోహిత్ జమాత్(ఎన్‌టిజె) సంస్థ శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లలో కర్నాటకు చెందిన ఇద్దరు వ్యక్తులు హనుమంత్రయప్ప, రంగన్న మృతి చెందారు.

 

Found 87 Bomb Detonators At Colombo’s Main Bus Station 

 

The post నిర్వీర్యం చేస్తుండగా పేలిన బాంబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: