‘కెజిఎఫ్‌ చాప్టర్-2’కోసం ఆడిషన్స్

బెంగుళూరు: క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ `కెజిఎఫ్‌` సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రబాస్ నటించిన `బాహుబ‌లి` త‌ర్వాత ఆ స్థాయిలో తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించిన ద‌క్షిణాది చిత్రం`కెజియ‌ఫ్. అయితే, త్వరలో `కెజిఎఫ్‌`పార్ట్-2 ప‌ట్టాలెక్కనుంది. ఈ సిన్మా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందని షూటింగ్ స‌మ‌యంలోనే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం చాప్ట‌ర్‌-2 షూటింగ్ ప‌నులు ఊపందుకున్నారు. ఈ చిత్రంలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న‌వాళ్ల కోసం చిత్ర‌యూనిట్ తాజాగా […] The post ‘కెజిఎఫ్‌ చాప్టర్-2’ కోసం ఆడిషన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
బెంగుళూరు: క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ `కెజిఎఫ్‌` సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రబాస్ నటించిన `బాహుబ‌లి` త‌ర్వాత ఆ స్థాయిలో తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించిన ద‌క్షిణాది చిత్రం`కెజియ‌ఫ్. అయితే, త్వరలో `కెజిఎఫ్‌`పార్ట్-2 ప‌ట్టాలెక్కనుంది. ఈ సిన్మా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందని షూటింగ్ స‌మ‌యంలోనే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం చాప్ట‌ర్‌-2 షూటింగ్ ప‌నులు ఊపందుకున్నారు.
ఈ చిత్రంలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న‌వాళ్ల కోసం చిత్ర‌యూనిట్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏప్రిల్ 26న బెంగ‌ళూరులోని జిఎమ్ రిజాయిజ్‌లో ఆడిష‌న్స్ జ‌రుపుతున్నట్టు ప్రకటించింది. 8 నుంచి 16 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గల పిల్ల‌లు, 25 సంవత్స‌రాల‌కు పైబ‌డిన పురుషులు కావాల‌ని ప్రకటనలో తెలిపింది. ఆడిష‌న్స్‌కు వ‌చ్చే ముందు ఒక నిమిషం ఉన్న ఏదైనా డైలాగ్‌ను నేర్చుకుని రావాల‌ని చిత్రబృదం సూచించింది.
Auditions for KGF Chapter 2

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘కెజిఎఫ్‌ చాప్టర్-2’ కోసం ఆడిషన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: