తాగిన మైకంలో చేసే పొరపాట్ల వల్ల…

విజయ్, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘అమృత నిలయం’. రాజా విక్రమ నరేంద్ర దర్శకత్వంలో ఆర్.పి. సమర్పణలో అను ఫిల్మ్ బ్యానర్‌పై రామ్మోహన్ నాగుల, ఎం.ప్రవీణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజా విక్రమనరేంద్ర మాట్లాడుతూ “యువత తాగిన మైకంలో చేసే పొరపాట్ల వల్ల పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవిత […] The post తాగిన మైకంలో చేసే పొరపాట్ల వల్ల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విజయ్, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘అమృత నిలయం’. రాజా విక్రమ నరేంద్ర దర్శకత్వంలో ఆర్.పి. సమర్పణలో అను ఫిల్మ్ బ్యానర్‌పై రామ్మోహన్ నాగుల, ఎం.ప్రవీణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజా విక్రమనరేంద్ర మాట్లాడుతూ “యువత తాగిన మైకంలో చేసే పొరపాట్ల వల్ల పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం”అని అన్నారు. నిర్మాతలు రామ్మోహన్ నాగుల, ఎం.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ “వైజాగ్‌లో ఎక్కువ శాతం షూటింగ్ చేశాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి త్వరలో సినిమాను విడుదల చేస్తాం”అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలుః రవినాయక్, సంగీతంః రామ్.

Amrutha Nilayam movie Shooting Completed

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తాగిన మైకంలో చేసే పొరపాట్ల వల్ల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: