ఈ వివక్ష పోవాలి

తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్స్‌ను అందుకుంది రకుల్‌ప్రీత్ సింగ్. ఇటీవల తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అదేవిధంగా ఈ హాట్‌బ్యూటీ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. ఇక ఈ భామ హీరోయిన్‌ల రెమ్యునరేషన్‌ల గురించి మాట్లాడుతూ “హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కుతున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. హీరోయిన్లు ఎంత స్టార్ ఇమేజ్ సంపాదించినప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం ఎదుగుదల లేదు. ఇక నయనతార సౌతిండియాలో లేడీ […] The post ఈ వివక్ష పోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్స్‌ను అందుకుంది రకుల్‌ప్రీత్ సింగ్. ఇటీవల తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అదేవిధంగా ఈ హాట్‌బ్యూటీ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. ఇక ఈ భామ హీరోయిన్‌ల రెమ్యునరేషన్‌ల గురించి మాట్లాడుతూ “హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కుతున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. హీరోయిన్లు ఎంత స్టార్ ఇమేజ్ సంపాదించినప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం ఎదుగుదల లేదు. ఇక నయనతార సౌతిండియాలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. కానీ ఆమె పారితోషికం స్టార్ హీరోలతో పోల్చుకుంటే చాలా తక్కువ. అదే దక్షిణాదిన చాలా మంది స్టార్ హీరోలు రూ.15 కోట్లు, అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈ వివక్ష పోవాలి. హీరోయిన్లకు కూడా పారితోషికం పెంచాలి. అయితే నేను మాత్రం దీని గురించి పెద్దగా ఆలోచించకుండా పనిచేసుకుంటూ పోతున్నాను”అని పేర్కొంది.

Rakul Preet Singh Talks About Hero-Heroine Pay Disparity

The post ఈ వివక్ష పోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: