చివరి ఓవర్ డ్రామా

ఒక పరుగు తేడాతో బెంగళూరు విజయం, ధోనీ ఇన్నింగ్స్ వృథా బెంగళూరు: ఏడు వరస విజయాలతో అప్రతిహతంగా సాగిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుకు మరోసారి బ్రేక్ పడింది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి తమ ముందుంచిన 162 పరుగుల సాధారణ లక్షాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చతికిల పడ్డారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతికి విజయానికి రెండు పరుగులు చయాల్సి ఉండగా […] The post చివరి ఓవర్ డ్రామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఒక పరుగు తేడాతో బెంగళూరు విజయం, ధోనీ ఇన్నింగ్స్ వృథా

బెంగళూరు: ఏడు వరస విజయాలతో అప్రతిహతంగా సాగిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుకు మరోసారి బ్రేక్ పడింది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి తమ ముందుంచిన 162 పరుగుల సాధారణ లక్షాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చతికిల పడ్డారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతికి విజయానికి రెండు పరుగులు చయాల్సి ఉండగా ధోనీ బంతి మిస్ అయ్యాడు. అయితే స్కోరును సమం చేయడం కోసం బై కోసం పరుగెత్తే క్రమంలో శార్దూల్ ఠాకూర్ రనౌట్ కావడంతో ఒక్క పరుగు తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. ఉమేశ్ యాదవ్ వేసిన చివరి ఓవర్‌లో ధోనీ మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో కలిపి 24 పరుగులు చేసి జట్టును విజయం అంచుల దాకా తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ధోనీ 48 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై జట్టుకు ఆదినుంచే కష్టాలు మొదలైనాయి.

డేల్ స్టెయిన్ వేసిన తొలి ఓవర్ అయిదో బంతికే షేన్ వాట్సన్ స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అ తర్వాతి బంతికే సురేశ్ రైనా కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దెబ్బనుంచి జట్టు కోలుకోక ముందే 17 పరుగుల స్కోరు వద్ద డు ప్లెసిస్‌ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయడంతో చెన్నై పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ప్లెసిస్ కేవలం అయిదు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో 11 పరుగుల తర్వాత కేదార్ జాదవ్ కూడా ఉమేశ్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటవడంతో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ ధోనీ, అంబటి రాయుడిపై పడింది. అయితే జట్టు స్కోరు 83 పరుగుల వద్ద 29 పరుగులు చేసిన అంబటి రాయుడు చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాయుడు స్కోరులో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా పరుగుల వేగం పెంచే ప్రయత్నంలో లేని పరుగుకు యత్నించే క్రమంలో రనౌట్ అయ్యాడు.అనంతరం వచ్చిన బ్రావోతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లడానికి యత్నించే క్రమంలో ధోనీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 19వ ఓవర్ చివరి బంతికి సైనీ బౌలింగ్‌లో బ్రావో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. బ్రావో కేవలం 5 పరుగులు చేశాడు. చివరి ఓవర్ డ్రామా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది.

పార్థివ్ అర్ధ సెంచరీ
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు 11 పరుగుల వద్దే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం తొమ్మిది పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్ ( 53;37 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు) ధాటిగా ఆడిఅర్ధ శతకం పూర్తి చేశాడు. అతనికి ఎబి డివిలియర్స్(25), అక్ష్‌దీప్‌నాథ్ (24), మార్కస్ స్టోయినిస్ (14)లు సహకారం అందించారు. చివర్లో మోయిన్ అలీ (26;16 బంతుల్లో అయిదు ఫోర్లు) దూకుడుగా ఆడి బెంగళూరు స్కోరును 160 దాటించాడు. కాగా చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, బ్రావోలు తలా రెండు వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహిర్ ఒక వికెట్ తీశాడు.

The post చివరి ఓవర్ డ్రామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: