ఎన్‌ఐఎ అదుపులో 4గురు ఐసిస్ సానుభూతిపరులు

  మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఎన్‌ఐఎ యూనిట్ 2016లో నమోదు చేసిన అబుదాబి మాడ్యూల్ కేసు విచారణలో భాగంగా నగరంలో శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఇదే కేసుకు సంబంధించి ఎన్‌ఐఎ బృందం వార్థాలోనూ సోదాలు చేపట్టింది. అబుదాబి మాడ్యూల్ కేసులోని నిందితులు హైదరాబాద్ నగరంలో తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో మైలార్‌దేవులపల్లిలో మూడు ప్రాంతాలలోని 8 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. స్థానిక కింగ్స్ ప్యాలెస్ నగర్‌లో ఉన్న తాహిర్ అనే యువకుడితో […] The post ఎన్‌ఐఎ అదుపులో 4గురు ఐసిస్ సానుభూతిపరులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఎన్‌ఐఎ యూనిట్ 2016లో నమోదు చేసిన అబుదాబి మాడ్యూల్ కేసు విచారణలో భాగంగా నగరంలో శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఇదే కేసుకు సంబంధించి ఎన్‌ఐఎ బృందం వార్థాలోనూ సోదాలు చేపట్టింది. అబుదాబి మాడ్యూల్ కేసులోని నిందితులు హైదరాబాద్ నగరంలో తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో మైలార్‌దేవులపల్లిలో మూడు ప్రాంతాలలోని 8 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. స్థానిక కింగ్స్ ప్యాలెస్ నగర్‌లో ఉన్న తాహిర్ అనే యువకుడితో పాటు శాస్త్రినగర్‌లో మరో ముగ్గురిని ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. సోదాలు సందర్భంగా తాహిర్‌ను ఎన్‌ఎఐ అధికారులు మూడు గంటలపాటు విచారించారు.

తాహిర్, మరో ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఎ అధికారులు 13 సెల్‌ఫోన్లు, 11 సిమ్‌కార్డులు, ఒక ఐ ప్యాడ్, 2 ల్యాప్‌టాప్‌లు, ఒక హార్డ్‌డిస్క్, 6 పెన్‌డ్రైవ్స్,ఎస్‌డి కార్డులు, 3 వాకీటాకీలు, ఉగ్రవాద సాహిత్యంతో పాటు కీలక వస్తుసామాగ్రిని ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అబుదాబి మాడ్యూల్ కేసులో ఎన్‌ఐఎ అరెస్ట్ చేసిన బాసిత్, అబ్దుల్ ఖాదిర్ అనే ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ పాక్ యువతితో సంబంధాలున్నట్లు అతని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిసింది. ఇన్‌స్టాలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, చర్చలలో కీలక ఆధారాలు లభ్యంకావడంతో నగరంలో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది.

NIA Arrested ISIS inspired person in Hyderabad

The post ఎన్‌ఐఎ అదుపులో 4గురు ఐసిస్ సానుభూతిపరులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: