ఇంటర్ మెమోలో మార్కుల తారుమారు…విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా

  నాంపల్లి : ఇంటర్ పరీక్ష నిర్వహణలో లోపాలు, మెమోలో మార్కుల తారుమారు వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపిస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనానికి కదం తొక్కారు. ఇంటర్ బోర్డు నిర్వాకాల వల్ల అత్యంత ప్రతిభ కల్గిన విద్యార్థులకు తీరని అన్యాయం జరిగి, వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందంటూ ఆగ్రహిస్తూ శనివారం నాంపల్లిలోని బోర్డు ఆఫ్ ఇంటర్ కార్యాలయ ఆవరణలో నిరసనకారులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు న్యాయం జరగాలి, మార్కుల మెమోలో తారుమారు […] The post ఇంటర్ మెమోలో మార్కుల తారుమారు… విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాంపల్లి : ఇంటర్ పరీక్ష నిర్వహణలో లోపాలు, మెమోలో మార్కుల తారుమారు వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపిస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనానికి కదం తొక్కారు. ఇంటర్ బోర్డు నిర్వాకాల వల్ల అత్యంత ప్రతిభ కల్గిన విద్యార్థులకు తీరని అన్యాయం జరిగి, వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందంటూ ఆగ్రహిస్తూ శనివారం నాంపల్లిలోని బోర్డు ఆఫ్ ఇంటర్ కార్యాలయ ఆవరణలో నిరసనకారులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు న్యాయం జరగాలి, మార్కుల మెమోలో తారుమారు జరిగింది. దీంతో టాపర్స్‌లకు తక్కువ మార్కులు వచ్చాయని, దీనికి ఇంటర్ బోర్డు పూర్తిగా బాధ్యత వహించాలని, బోర్డు తప్పిదాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమే అంటూ మండిపడ్డారు. ప్రతిభ కల్గిన విద్యార్థులు ఫెయిలయ్యారని, దీంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి బోర్డు ఆఫ్ ఇంటర్ వర్గాలే బాధ్యులంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు.

సామర్ధత కల్గిన విద్యార్థులకు న్యాయం జరగాలి, మళ్లీ రీ కౌంటింగ్ జరపాలి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి, విద్యార్థుల చావులకు వారే బాధ్యత వహించాలి, ఫెయిలైన వారికి వెరిఫికేషన్ నిర్వహించాలంటూ ఆందోళనకారుల నినాదాలు మిన్నంటాయి. తమ కొడుకుకి అన్ని సబ్జెక్టుల్లో 80 పైగా మార్కులు రాగా, ఒకే సబ్జెకుట్లో కేవలం 9 మార్కులు రావడంతో ఫెయిల్ అయ్యాడు. ఆలానే మరో విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో 70 పైగా మార్కులు రాగా. ఒక సబ్జెక్టుల్లో కేవలం 4 మార్కులతో తప్పాడంటూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు. ఇలానే బోర్డు వర్గాల తప్పిదాలు, నిర్లక్ష్యం వల్లనే అనేక మంది ప్రతిభ కల్గిన విద్యార్థులకు నష్ఠం జరిగిందని, దీంతో కొందరు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అత్యంత ప్రతిభ కల్గిన విద్యార్థులకు అతి తక్కువ మార్కులు రావడం తమను అశ్చర్యానికి గురి చేసిందని, దీనికి బోర్డు ఇంటర్ కార్యదర్శి జవాబు ఇవ్వాలని కోరారు. బోర్డు పరీక్షల నిర్వహణ పూర్తిగా లోపభూయిష్ఠంగా ఉందని, మార్కుల గోల్‌మాల్ వ్యవహారాన్ని నిగ్గు తెల్చేందుకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Students protests before the Nampally Inter Board Office

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇంటర్ మెమోలో మార్కుల తారుమారు… విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: