చక్కెర లాబీ…చిక్కుల ఊబి

  చిక్కుల్లో నలుగుతున్న చక్కెర పరిశ్రమ గట్టెక్కాలంటే చెరకుకు బదులు బీట్‌ను ప్రోత్సహించడమే సరైన ప్రత్యామ్నాయంగా వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మార్పుకు చక్కెర లాబీ ముందుకు రావడం లేదు. బీట్‌ను ప్రోత్సహిస్తే తమ పెత్తనం తగ్గిపోతుందన్న అనుమానం ‘లాబీ’ని పట్టి పీడిస్తోంది. దేశంలో చక్కెర డిమాండ్ ఏడాదికి 25 మిలియన్ టన్నుల వరకు ఉన్నా 35 మిలియన్ టన్నులకు మించి ఉత్పత్తి చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సుగర్ బీట్‌ను సాగు చేయడమే సరైన […] The post చక్కెర లాబీ… చిక్కుల ఊబి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిక్కుల్లో నలుగుతున్న చక్కెర పరిశ్రమ గట్టెక్కాలంటే చెరకుకు బదులు బీట్‌ను ప్రోత్సహించడమే సరైన ప్రత్యామ్నాయంగా వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మార్పుకు చక్కెర లాబీ ముందుకు రావడం లేదు. బీట్‌ను ప్రోత్సహిస్తే తమ పెత్తనం తగ్గిపోతుందన్న అనుమానం ‘లాబీ’ని పట్టి పీడిస్తోంది. దేశంలో చక్కెర డిమాండ్ ఏడాదికి 25 మిలియన్ టన్నుల వరకు ఉన్నా 35 మిలియన్ టన్నులకు మించి ఉత్పత్తి చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సుగర్ బీట్‌ను సాగు చేయడమే సరైన ప్రత్యామ్నాయం చెరకు సాగుకు కావలసిన నీరు కన్నా అందులో 30 శాతం వినియోగిస్తే బీట్ సాగుకు సరిపోతుంది. చెరుకు సాగుకు దాదాపు ఏడాది వరకు సమయం తీసుకోగా సుగర్ బీట్ నాలుగు నెలలకే అందుబాటులోకి వస్తుంది. 

చక్కెర పరిశ్రమ తీరని సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం మనం పూర్తిగా చెరకు పంటపై ఆధారపడడం. దేశంలో చక్కెర పరిశ్రమను నడిపిస్తున్నది రాజకీయ లాబీ. ఇంది ఎంతో శక్తివంతమైనది. ఈ లాబీ చెరకు రైతుల పాలిటి ఊబిగా మారుతోంది. చక్కెర పండించడానికి అన్ని పంటలకన్నా అత్యధిక శాతం నీరు అవసరం. సంక్షోభానికి ఇదే మొదటి అంశం. ఒక హెక్టారు చెరకు పండించడానికి 2 కోట్ల లీటర్ల నీరు అవసరం కాగా ఇందులో ఏడో వంతు నీరు ఇతర ఆరుతడి పంటలు పండించడానికి సరిపోతుంది. అట్లాగే టన్ను చెరకు క్రషింగ్ చేయడానికి దాదాపు 400 లీటర్ల నీరు అందించక తప్పదు. ఇంతపెద్ద ఎత్తున సరఫరా చేయకుండా సగానికి సగం అంటే 200 లీటర్ల వరకు నీటి సరఫరా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా అవి పని చేయడం లేదు.

1200కు పైగా చక్కెర కర్మాగారాలున్న మహారాష్ట్ర చక్కెర సామ్రాజ్యంగా ఘనత వహించినప్పటికీ చక్కెర కర్మాగారాల్లోని రాజకీయ నాయకుల ప్రాబల్యం కారణంగా నీటి కేటాయింపుల్లో అసమానతలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతంలో 86 చక్కెర కర్మాగారాలు, లాతూర్ జిల్లాలో 7 భారీ చక్కెర కర్మాగారాలున్నాయి. ఇవన్నీ సహకార పద్ధతిలోనే నెలకొల్పినప్పటికీ రాజకీయ నాయకుల పెత్తనంతోనే నడుస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుల అజమాయిషీ ఉన్నందున కర్మాగారాల లాభాలకు, రైతులకు గిట్టుబాటు ధర కల్పనకు ఎలాంటి ఢోకా ఉండదన్న నమ్మకంతోనే రైతులు చెరకు సాగువైపే మొగ్గు చూపడం పరిపాటిగా మారింది. ఉస్మానాబాద్, బీడ్, లాతూర్ వంటి చోట్ల ఎక్కువగా చక్కెర కర్మాగారాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవన్నీ కరవు పీడిత ప్రాంతాలే. అయినా ఇలా కర్మాగారాలకు నీటి సరఫరా నియంత్రించడానికి ఎవరూ సాహసించడం లేదు.

లాతూర్ జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు రోజుకు 11200 టన్నుల చెరకును క్రషింగ్ చేసే సామర్థం ఉంది. ఇవి గనుక పూర్తి స్థాయిలో పని చేస్తే రోజుకు 45 లక్షల లీటర్ల నీరు అవసరం. ఇంత మొత్తంలో భారీగా సాగునీరు సరఫరా చేస్తే తాగు నీటికి కరవు తప్పుదు. అయినా అధికార యంత్రాంగం నీటి సరఫరాను నియంత్రించలేకపోతోంది. మహారాష్ట్ర మొత్తం సాగు భూమిలో 9 శాతం ఆక్రమించే చెరకు పంట నీటి వాడకంలో మాత్రం 71 శాతం ఆక్రమించింది. ఎక్కువ నీరు అవసరపడే చెరకు సాగుకు బదులు తక్కువ నీటితో సాగయ్యే వేరే పంటల వైపు కానీ, బిందే సేద్యం వైపు కానీ రైతులు దృష్టి మరల్చేలా ప్రభుత్వం ప్రయత్నంచలేకపోతోందన్నది వాస్తవం.

1999లో జల వనరుల నిర్వహణ నిపుణుడు మాధవ్ నేతృత్వంలోని కమిటీ కరవు పీడిత ప్రాంతాల్లో చక్కెర కర్మాగారాలను మూసి వేయాలని, వాటిని వేరే చోటికి తరలించాలని సిఫారసు చేసింది. అయినా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చక్కెర ఉత్పత్తికి ఎక్కువ వ్యయం భరించవలసి వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో చెరకు రైతులకు చెల్లించవలసిన బకాయిలు 10 వేల కోట్ల రూపాయలకు మించిపోతోంది. ఈ భారీ యాంత్రిక, పాలక, రాజకీయ మాంత్రిక వ్యవస్థ ముందు వెన్నెముక లేని ధీనుడుగా రైతు చేతులు జోడించి తలవంచుకుని నిల్చుండవలసి వస్తోంది. కోట్ల మేరకు పేరుకు పోయిన తమ బకాయిలు ఎప్పటికైనా ఈ రాజకీయ లాబీ చెల్లించగలదన్న ఆశ అన్న దాతలను వెంటాడుతోంది.

చిక్కుల్లో నలుగుతున్న చక్కెర పరిశ్రమ గట్టెక్కాలంటే చెరకుకు బదులు బీట్‌ను ప్రోత్సహించడమే సరైన ప్రత్యామ్నాయంగా వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మార్పుకు చక్కెర లాబీ ముందుకు రావడం లేదు. బీట్‌ను ప్రోత్సహిస్తే తమ పెత్తనం తగ్గిపోతుందన్న అనుమానం ‘లాబీ’ని పట్టి పీడిస్తోంది. దేశంలో చక్కెర డిమాండ్ ఏడాదికి 25 మిలియన్ టన్నుల వరకు ఉన్నా 35 మిలియన్ టన్నులకు మించి ఉత్పత్తి చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సుగర్ బీట్‌ను సాగు చేయడమే సరైన ప్రత్యామ్నాయం చెరకు సాగుకు కావలసిన నీరు కన్నా అందులో 30 శాతం వినియోగిస్తే బీట్ సాగుకు సరిపోతుంది. చెరుకు సాగుకు దాదాపు ఏడాది వరకు సమయం తీసుకోగా సుగర్ బీట్ నాలుగు నెలలకే అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు చెరకులో కన్నా బీట్‌లో చక్కెర శాతం ఎక్కువ.

చక్కెరను వేరు చేసిన తరువాత ఆ అవశేష బీట్ పాడి, పశుసంవర్ధక రంగాలకు కూడా ఉపయోగపడుతుంది. బీట్ సాగు అందుబాటులోకి వచ్చిన తరువాత మిగతా ఎనిమిది నెలల కాలంలో వ్యవసాయ క్షేత్రంలో ఇతర పంటలను పండించుకోవచ్చు. బీట్ నుంచి ఇథనాల్ కూడా తయారు చేసి వాహనాల ఇంధనంలో కలిపి వినియోగించవచ్చు. బ్రెజిల్‌లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎన్నో రకాలుగా బీట్‌ను వినియోగించి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేసుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. సుగర్ బీట్స్‌లో ఆస్మాసిస్ ప్రయోగం ద్వారా చక్కెరను సేకరిస్తారు. నీటి పొదుపు, వ్యయం అదుపు తదితర లాభసాటి అంశాలు ఉన్నందున సుగర్ బీట్‌ను సాగు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు యోచిస్తోంది.

ప్రపంచ దేశాల్లో బీట్ రూట్ నుంచే ఎక్కువగా చక్కెర ఉత్పత్తి అవుతోంది. ఈ వాస్తవాలను పరిశీలించకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెరకుపైనే ఎక్కువగా ఆధారపడడం అనర్థాలకు దారి తీస్తోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం రగులుతుండడానికి కావేరీ డెల్టాలో ఎక్కువ భాగం చెరుకు సాగులో తరతరాలుగా కొనసాగుతుండడమే అసలు కారణం. దేశంలో అరవై ఏళ్లుగా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చక్కెర పరిశ్రమ వర్థిల్లింది. కానీ రానురాను ఈ పరిస్థితి మారుతోంది. జల వనరులు మృగ్యమవుతున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. రైతులకు కొన్ని కోట్లు బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇవన్నీ పరిష్కారం కావాలంటే చేతులు కాల్చుకుని చెరకు సాగు చేయడం కన్నా బీట్ రూటుతో తక్కువ ఖర్చుతో నీటి పొదుపు పాటించడమే మేలు. సుందర్ బన్, గంగానగర్ ప్రాంతాల్లో బీట్ సాగును ప్రయోగాత్మకంగా ప్రభుత్వం చేపట్టింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలు సుగర్ బీట్‌లో గొప్పతనాన్ని మనకన్నా ముందుగానే గ్రహించి సాగును ప్రారంభించడం విశేషం.

Sugar demand in india about 25-35 million tonnes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చక్కెర లాబీ… చిక్కుల ఊబి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: