వలస కార్మికుల శ్రమ దోపిడి…

  వలస కార్మికుల శ్రమ దోపిడి పలుచోట్ల అక్రమంగా ఇటుక బట్టిల నిర్వహణ గుట్టు చప్పుడు కాకుండా ఉచిత కరెంట్ వినియోగం కార్మికులకు కనీస వసతులు కరువు ఇటుకలు చేయడం.. వాటిని పేర్చడం బట్టి పెట్టి కాల్చడం మాత్రమే వారికి తెలుసు… యజమానులు వారి శ్రమతో లక్షలు గడిస్తున్నారని తెలియదు. సర్కారుకు పన్నలు చెల్లించకుండా అక్రమాలు చేస్తున్న విషయం వారికి పట్టదు. కనీసం ఇక్క డి ఊరి జనానికి సంబంధం లేకుండా పట్టణ శివారులో ఒరిస్సా కార్మికులు […] The post వలస కార్మికుల శ్రమ దోపిడి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వలస కార్మికుల శ్రమ దోపిడి
పలుచోట్ల అక్రమంగా ఇటుక బట్టిల నిర్వహణ
గుట్టు చప్పుడు కాకుండా ఉచిత కరెంట్ వినియోగం
కార్మికులకు కనీస వసతులు కరువు

ఇటుకలు చేయడం.. వాటిని పేర్చడం బట్టి పెట్టి కాల్చడం మాత్రమే వారికి తెలుసు… యజమానులు వారి శ్రమతో లక్షలు గడిస్తున్నారని తెలియదు. సర్కారుకు పన్నలు చెల్లించకుండా అక్రమాలు చేస్తున్న విషయం వారికి పట్టదు. కనీసం ఇక్క డి ఊరి జనానికి సంబంధం లేకుండా పట్టణ శివారులో ఒరిస్సా కార్మికులు ఆటవిక జీవనాన్నే కొనసాగిస్తున్నా రు. రెక్కల కష్టాన్ని నమ్ముకోని వచ్చిన కార్మికులు ఇటుక బట్టిల్లో నుంచి వెదజల్లుతున్న పొగ, దుమ్ము, ధూళి మధ్య అనారోగ్యంతో పాటు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇటుక బట్టిలను నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 వేల మంది వరకు ఒరిస్సా కార్మికులు కుటుంబాలతో తరలివచ్చి బట్టిల వద్ద కనీస వసతులు లేకుండా దుర్భరమైనా జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

మన తెలంగాణ/సిరిసిల్ల క్రైం: జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో ఇటుక బట్టిలు ఎక్కువగా కొనసాగిస్తున్నారు. బట్టిల నిర్వహణకు ప్రభుత్వ భూములా, పట్టా భూములా అని భూగర్భ గనుల శాఖ, రెవె న్యూ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బట్టి యజమానులు ఒకటి రెండు బట్టిలకు అనుమతులు పొంది అనేక ఎకరాల్లో బట్టిలను కొనసాగిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నా యి. అధికారులు ఆటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఇటుక బట్టిల వద్ద ఉన్న పొలాలకు ఉచిత విద్యుత్‌తో నడిచే బోరు బావుల నుంచి నీటిని వినియోగించుకుంటున్నారు. కోట్ల రూపాయాల్లోనే ఇ టుక బట్టిల ద్వారా లావాదేవిలు జరుగుతున్నా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు మాత్రం ఎగనామం పెడుతున్నారు. సింగరేణి నుంచి బొగ్గును కూడా వీరు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు బొ గ్గు లారీలను పట్టుకోని మైనింగ్ అధికారులు జరిమానాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు కార్మికులతో పొ ద్దంతా పని చేయిస్తూ కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. వెయ్యి ఇటుకుల తయారికి ఇంతా అంటూ రకరకాల కూలీని నిర్ణయిస్తున్నారు. వర్షం, వచ్చినా, ఏదైనా కార ణం చేత ఇటుకలు పాడై పోయినా కూలీ డబ్బులు వారికి చెల్లించడం లేదు. దీని వల్ల కూడా వారు నష్టపోతున్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చిన కార్మిక కుటుంబాలకు రోజుకు రూ.300లు కూడా గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు కరువు….
ఇటుక బట్టిల వద్ద కనీస వసతులు కల్పించాల్సి ఉన్నా వాటి ఊసే యజమానులు ఎత్తడం లేదు. బట్టి వద్ద గుడిసెలు వేసుకొని పిల్లా పాపలతో జీవనం గడుపుతూ పనులు చేస్తున్నారు. కనీసం బట్టిల వద్ద ఉన్న గుడిసెలో ఒక మనిషి నిలబడితే మరో మనిషి రావడానికి కూడా వీలుండదు. వాటికి తలుపు లు కూడా లేకుండా పాత బట్టలను కట్టుకొని ఉంటున్నారు. స్నానాల గదులు , మరుగుదొడ్లు కూడా ఉండకపోవడంతో ఆరుబయటలకు వెళ్లె సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు.
బట్టిలో బాల్యం బంది….
ఇటుక బట్టిలో కార్మికుల శ్రమ దోపిడికి గురిఅవుతుండగా, మరొపక్కా కార్మికుల పిల్లల బాల్యం బంది అవుతుంది. దుమ్ము, దూళితో బట్టిల మధ్య మగ్గిపోతున్నారు. బట్టిల వద్ద పాఠశాల ఏర్పాటు చేసి విద్యను అందించాల్సి ఉండగా, అలాంటి సౌకర్యాలు ఏ బట్టిల వద్ద కూడా కల్పించలేదు. పిల్లలు ఇటుకలతోనే ఆటలు ఆడుతూ చదువులకు దూరంగా ఉంటున్నారు. కనీసం బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా పెరుగుతున్నారు. వారి ఆరోగ్యం పై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. కొంత వయస్సు రాగానే బాల్యంలోనే ఇటుకలు మోయడం వంటి పనులను తల్లిదండ్రులతో పాటు చేస్తున్నారు.

Loot of migrant laborers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వలస కార్మికుల శ్రమ దోపిడి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: