చింత చిగురు సకల రోగనివారిణి

  చింతచిగురు పేరు వినగానే నోరూరుతుంది. ఈ ఆకులతో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. ఈ కాలంలో విరివిగా దొరికే చింతచిగురులో పోషకాలు ఎక్కువ. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింతచిగురు తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఈ ఆకులో ఉన్నాయి. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు […] The post చింత చిగురు సకల రోగనివారిణి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చింతచిగురు పేరు వినగానే నోరూరుతుంది. ఈ ఆకులతో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. ఈ కాలంలో విరివిగా దొరికే చింతచిగురులో పోషకాలు ఎక్కువ. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింతచిగురు తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఈ ఆకులో ఉన్నాయి. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి ఉండటం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

వంకాయ, రొయ్యలతో కూర

తయారీ విధానం: చింతచిగురు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ప్యాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి ఎండు రొయ్యలను దోరగా వేయించుకోవాలి. వంకాయలను తరిగి ఉప్పునీళ్లలో వేసుకోవాలి. గిన్నె లేదా ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత చింతచిగురు, ధనియాల పొడి వేసి వేపాలి. రొయ్యలు, వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. పచ్చి రొయ్యలను కూడా వేయెచ్చు. అప్పుడు రొయ్యలు ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు వేయాలి.

కావలసినవి:
వంకాయలు – 250 గ్రాములు, ఎండు రొయ్యలు – 100 గ్రా॥, చింతచిగురు – 50 గ్రా॥, ఉల్లిపాయ – 1, కరివేపాకు – 2 రెబ్బలు, పసుపు – 1/4 టీస్పూన్, కారం పొడి – 1 టీస్పూన్, ధనియాలపొడి – 1 టీస్పూన్, గరం మసాలా పొడి – 1/4 టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 4 టీస్పూన్.

బొమ్మిడాయిలు, మామిడికాయ కూర

తయారీ విధానం : బొమ్మిడాయిలను తల, తోక తీసేసి రెండు లేదా మూడు అంగుళాల ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి ఈ బొమ్మిడాయి ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి, ధనియాలపొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత చింత చిగురు, చెక్కు తీసి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత కప్పు నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలిపి వేయించిన బొమ్మిడాయి ముక్కలు కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికి చిక్కబడ్డాక గరం మసాలా పొడి వేసి దింపేయాలి.

కావాల్సినవి:
బొమ్మిడాయిలు – 4, మామిడికాయ – 1, చింతచిగురు – 50 గ్రా॥, ఉల్లిపాయలు – 2, పసుపు – 1/4 టీస్పూన్, కారం పొడి – 1 టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్, గరం మసాలా పొడి – 1/4 టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్,ఉప్పు – తగినంత,నూనె – 4 టీస్పూన్.

గుడ్డు కూర

తయారీ విధానం: ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో శుభ్రం చేసుకున్న చింతచిగురు వేసి మరి కొద్దిగా వేపాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి , కారం పొడి వేసి కలిపి తగినంత ఉప్పు, పావు కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టాలి. మొత్తం ఉడికిన తర్వాత గుడ్లు కొట్టి వేసి కలపకుండా మూతపెట్టాలి. తర్వాత గుడ్డు ముక్కలు కాకుండా మెల్లిగా కలిపి గరం మసాలా పొడి వేసి దింపేయాలి.

కావాల్సినవి: గుడ్లు – 3, ఉల్లిపాయలు – 4, చింతచిగురు – 50 గా॥, పసుపు – 1/4 టీస్పూన్, కారం పొడి – 1టీస్పూన్, గరం మసాలా పొడి – 1/4 టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 3 టీస్పూన్లు.

మామిడికాయ పప్పు

తయారీ విధానం: కందిపప్పు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి, పసుపు, కాస్త నూనె వేసి ఉడికించాలి. వెడల్పాటి ప్యాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో చెక్కు తీసి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, చింతచిగురు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మెత్తబడ్డాక కాస్త మెదిపి ఉడికిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. చిన్న గరిట లేదా గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక కరివేపాకు, నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించి పప్పులో కలపాలి.

కావలసినవి: కందిపప్పు – 200 గ్రా॥, చింతచిగురు – 50 గ్రా॥, మామిడికాయ – 1 చిన్నది, ఉల్లిపాయ – 1 చిన్నది, పచ్చిమిర్చి – 6, కరివేపాకు – 2 రెబ్బలు, కొత్తిమిర – కొద్దిగా, పసుపు – 1/4 టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె -3 టీస్పూన్నెయ్యి – 2 టీ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర – 1/4, ఎండుమిర్చి – 3, వెల్లుల్లి రెబ్బలు – 4, 6.

పెరుగు పచ్చడి

తయారీ విధానం: కమ్మని గట్టి పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుము కలపాలి. ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేగిన తరువాత చివరగా నలిపిన చింతచిగురు, కారం పొడి వేసి కలపాలి. చింత చిగురు కాస్త మెత్తబడ్డాక దింపి పెరుగులో కలపాలి.

కావాల్సినవి: పెరుగు – 200 గ్రా॥, కొబ్బరి తురుము 100గ్రా॥, శనగపప్పు – 1 గ్రా॥, మినప్పప్పు – 1 గ్రా॥, ఆవాలు – 1/4 టీస్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, చింతచిగురు – 20 గ్రా॥, ఎండు కారం పొడి – 1/4 టీస్పూన్, ఎండుమిర్చి – 3, నూనె – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత.

Variety Best Tamarind Leaves Recipes in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చింత చిగురు సకల రోగనివారిణి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: