విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ల దందా

చెట్ల కొమ్మల నరికివేతకు నామినేషన్ పద్దతిలో పనులు అప్పగిస్తున్న అధికారులు   మనతెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పలు విద్యుత్ శాఖ సబ్‌డివిజన్లలో ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లకు లబ్దిచేకూరే విధంగా నిబంధనలు అతిక్రమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ టెండర్ల ద్వారా పనులు అప్పగించాల్సి ఉండగా అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చే తాయిలాలకు ఆశపడి నామినేషన్ పద్దతిలో పనులు అప్పగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చెట్ల నరికి వేత పనులకు సంబంధించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోణలు వస్తున్నాయి. […] The post విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ల దందా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెట్ల కొమ్మల నరికివేతకు
నామినేషన్ పద్దతిలో పనులు అప్పగిస్తున్న అధికారులు

 

మనతెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పలు విద్యుత్ శాఖ సబ్‌డివిజన్లలో ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లకు లబ్దిచేకూరే విధంగా నిబంధనలు అతిక్రమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ టెండర్ల ద్వారా పనులు అప్పగించాల్సి ఉండగా అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చే తాయిలాలకు ఆశపడి నామినేషన్ పద్దతిలో పనులు అప్పగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా చెట్ల నరికి వేత పనులకు సంబంధించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోణలు వస్తున్నాయి. వేసవిలో వీచే పెనుగాలులకు చెట్లు కొమ్మల గుండా వెళ్ళే విద్యుత్ వైర్లు ఒక దానికి ఒకటి ఆనుకుని తద్వారా షార్ట్ సర్యూట్ కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుంటాయి. అంతే కాదు వేసవి కాలం అనంతరం వచ్చే వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో విద్యుత్ వైర్లకు అడ్డంగా వచ్చే చెట్లకొమ్మలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇటుంటి పనులను తమకు ఆప్తులైన వారికి కాంట్రాక్టు నామినేషన్ పద్దతిలో పనులు అప్పగిస్తూ పెద్ద మొత్తంలో దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వాస్తవానికి ఇటువంటి పనులను. ప్రభుత్వం నిబంధనల ప్రకారం బహిరంగ టెండర్ల ఆహ్వానించి అభివృద్ది పనులను అప్పగించాల్సి ఉండగా ఇక్కడ అధికారులు నిబంధనలు ఉల్లంగించి నామినేషన్ పద్దతిలో పనులు అప్పగిస్తూ కాంట్రాక్టర్ల నుంచి నుంచి కమిషన్ దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం చెట్ల కొమ్మల నరికి వేతన పనులే కాకుండా కొత్త కరెంట్ స్తంబాల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, బిల్లింగ్ వసూళ్ళు, , ఫీజ్ ఆఫ్ కాల్స్‌కు సంబంధించి ఎమర్జన్సీ లైన్లు తదితర పనులను అధికారులు తమకు ఆప్తులైన కాంట్రాక్టర్లకు అప్పచెప్పుతూ వారి వద్ద నుంచి కమిషన్లు దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

గత 10 సంత్సరాలుగా కొంతమంది కాంట్రాక్టర్లు నామినేషన్ పద్దతిలో అభివృద్ది పనులు అప్పగిస్తుండంటంతో సదరు కాంట్రాక్టురు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. ఆయా పనులకు తక్కువ లేబర్‌ను పెట్టుకుని పని చేయించుకుని ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టడమే కాకుండా పనులు నాణ్యతకు కూడా తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అంబర్‌పేట విద్యుత్ (ట్రాన్స్‌కో)సబ్ డివిజన్ పరిధిలో అధికారులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిలో అభివృద్ది పనులు అప్పగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది అధికారులు తమ స్నేహితులకు, బంధువులకు కూడా ఇదేతరహా పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంబంధిత అధికారులు నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. అంతే కాకుండా బహిరంగ టెండర్ల ద్వారా పనులు అప్పగించి అభివృద్ది పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.

 

Contractors Fraud in Electrical Department in Hyderabad

The post విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ల దందా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: