రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హనుమన్ భక్తులు దుర్మరణం

  జగిత్యాల /కొడిమ్యాల : దొంగల మర్రి చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అంజన్న భక్తులు దుర్మరణం చెందిన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పొన్నం అరుణ్‌ కుమార్ (22), పులి రాజేందర్ అనే ఇద్దరు అంజన్న భక్తులు పాదయాత్ర చేసుకుంటూ.. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం బయలు దేరారు. శుక్రవారం ఉదయం దొంగలమర్రి చెక్‌పోస్టు సమీపంలో గుర్తు తెలియని లారీ […] The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హనుమన్ భక్తులు దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జగిత్యాల /కొడిమ్యాల : దొంగల మర్రి చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అంజన్న భక్తులు దుర్మరణం చెందిన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పొన్నం అరుణ్‌ కుమార్ (22), పులి రాజేందర్ అనే ఇద్దరు అంజన్న భక్తులు పాదయాత్ర చేసుకుంటూ.. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం బయలు దేరారు. శుక్రవారం ఉదయం దొంగలమర్రి చెక్‌పోస్టు సమీపంలో గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో పులి రాజేందర్‌ కు తీవ్ర గాయాల కాగా.. అరుణ్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేసుకొని గాయలపాలైన పులి రాజేందర్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సంఘటన స్థలాన్ని కొడిమ్యాల ఎస్‌ఐ సతీష్‌కుమార్ పరిశీలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Hanuman devotees died in road accident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హనుమన్ భక్తులు దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: