సేంద్రీయ ఎరువులతో రైతులకు అధిక దిగుబడులు…

పెంచికల్‌పేట్‌: పర్యావరణాన్ని కాపాడడం కత్తిమీద సాముగా మారిన ఈ రోజుల్లో పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా అడవి నుండి వంట చెరుకు తెచ్చుకోవడం కఠినంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఉచితంగా బయోగ్యాస్ ప్లాంట్‌లను నిర్మిస్తూ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎస్‌కెజి సంఘం అనే స్వచ్ఛంద సంస్థ. రైతులు పోటీ పడుతూ విచ్చల విడిగా రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం దెబ్బతిని భూమి కలుషితమవుతుంది. ఈ ప్లాంట్ నుండి వచ్చే ఎరువులను వాడడం వల్ల కొంతమేరకైనా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని […] The post సేంద్రీయ ఎరువులతో రైతులకు అధిక దిగుబడులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పెంచికల్‌పేట్‌: పర్యావరణాన్ని కాపాడడం కత్తిమీద సాముగా మారిన ఈ రోజుల్లో పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా అడవి నుండి వంట చెరుకు తెచ్చుకోవడం కఠినంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఉచితంగా బయోగ్యాస్ ప్లాంట్‌లను నిర్మిస్తూ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎస్‌కెజి సంఘం అనే స్వచ్ఛంద సంస్థ. రైతులు పోటీ పడుతూ విచ్చల విడిగా రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం దెబ్బతిని భూమి కలుషితమవుతుంది. ఈ ప్లాంట్ నుండి వచ్చే ఎరువులను వాడడం వల్ల కొంతమేరకైనా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని రైతులను ప్రోత్సహిస్తున్నారు.

ఈసంస్థ ప్రతినిధులు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఈ ప్రాజెక్టులో తీసుకోవడానికి కారణం ఆదిలాబాద్ జిల్లాలో గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. మిగత జిల్లాలతో పోల్చినప్పుడు ఇక్కడి భూముల కాలుష్యం తక్కువ, అలాంటి సమయంలో ఇలాంటి భూములను కాలుష్యం నుండి కాపాడాలని దృఢసంకల్పంతో ప్రారంభించారు. ఆదిలాబాద్ బయోగ్యాస్ ప్రాజెక్టు మంచిర్యాల కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ నూతనంగా ఏర్పడిన నాలుగు జిల్లాల్లో ప్లాంట్‌ల నిర్మాణాలు చేపడుతుంది. వంట చెరుకు కోసం అడవులను నరకడం వంటి చర్యలను తగ్గించాలని పాడిపశువులను పెంచుకోవాలని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దానికి గాను ప్రజలకు అధునాథన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ఉచితంగా బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించి ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండడంతో గిరిజనులకు చేరువ చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారు.

భారతదేశం లో కేవలం 14 జిల్లాలలో (కర్ణాటక,మధ్యప్రదేశ్, తెలంగాణ)తెలంగాణలో ఆదిలాబాద్‌లో దాదాపు సుమారుగా 25 వేల ఖర్చుతో ఉచితంగా బయో గ్యాస్ ప్లాంట్  నిర్మించి ఇస్తున్నారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్‌లో పశువుల పేడను ఉపయోగించి మీతేను వాయువు ఉత్పత్తి చేసి, దానిని గ్యాస్ స్టవ్‌కు పైపుల ద్వారా అనుసందానం చేస్తారు. దీనికి పూర్తిగా ఐఎస్‌ఐ మార్కు రాడ్, 43గ్రేడ్ సిమెంట్ కంకరను ఉపయోగించి నాణ్యంగా నిర్మిస్తున్నారు. పెంచికల్‌పేట్ పరిధి సమీప గ్రామాలైనా గుంట్లపేట, పోతపల్లి, ఎల్కపల్లి, ఎల్లూరు, లోడుపల్లి, కొండపల్లి, ముంజంపల్లి, చేరువాయి, బొంబాయిగూడ, గిరవెళ్లి గ్రామాలలో ఈబయోగ్యాస్ ప్లాంట్‌లను నిర్మిస్తున్నారు. బెజ్జూర్, దహెగాం, పెంచికల్‌పేట్ మండలాల్లోని ఆసక్తి గల వారు బండి మహేష్ సూపర్‌వైజర్ సెల్: 6302969906ను సంప్రదించినట్లయితే ప్లాంట్‌ల నిర్మాణం చేపడుతామని ఆయన తెలిపారు.

High yields for farmers with organic manure

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సేంద్రీయ ఎరువులతో రైతులకు అధిక దిగుబడులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: