జోగినాథ్‌స్వామి జాతర ఉత్సవాలు…

  జోగిపేటలో ముగిసిన జోగినాథ్‌స్వామి జాతర ఉత్సవాలు.. ఘనంగా రథోత్సవం..ఆకట్టుకున్న లంకాదహనం వైభవంగా శివపార్వతుల కళ్యాణం..అబ్బుర పరిచిన అగ్నిగుండాలు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం. జోగిపేట: గత వారం రోజులుగా వైభవంగా కొనసాగిన జోగిపేట జోగినాథస్వామి జాతర ఉత్సవాలు గురువారం చివరి ఘట్టమైన లంకాదహన కార్యక్రమంతో ముగిసాయి. వైభవంగా రథోత్సవం..కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణం..రైతుల ఎడ్ల బండ్ల ఊరేగింపు..భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో పాటు లంకాదహనం ఇలా జాతర ఉత్సవాలు వారంరోజుల పాటు అందరిని ఆకట్టుకున్నాయి. జాతరలో రథోత్సవం, […] The post జోగినాథ్‌స్వామి జాతర ఉత్సవాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జోగిపేటలో ముగిసిన జోగినాథ్‌స్వామి జాతర ఉత్సవాలు..
ఘనంగా రథోత్సవం..ఆకట్టుకున్న లంకాదహనం
వైభవంగా శివపార్వతుల కళ్యాణం..అబ్బుర పరిచిన అగ్నిగుండాలు
వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం.

జోగిపేట: గత వారం రోజులుగా వైభవంగా కొనసాగిన జోగిపేట జోగినాథస్వామి జాతర ఉత్సవాలు గురువారం చివరి ఘట్టమైన లంకాదహన కార్యక్రమంతో ముగిసాయి. వైభవంగా రథోత్సవం..కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణం..రైతుల ఎడ్ల బండ్ల ఊరేగింపు..భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో పాటు లంకాదహనం ఇలా జాతర ఉత్సవాలు వారంరోజుల పాటు అందరిని ఆకట్టుకున్నాయి. జాతరలో రథోత్సవం, లంకాదహన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకుని ముఖ్యమైన ఘట్టాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమాలు వేలాది మంది భక్తజనసందోహం మధ్య జరిగాయి.
ఘనంగా లంకాదహనం..
జాతరలో చివరి ఘట్టమైన లంకాదహన కార్యక్రమం గురువారం ఆర్ధరాత్రి 12గంటల తరువాత వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్‌టిఆర్ క్రీడామైదానంలో రావణాసురుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బాణాసంచాతో కూడిన వివిధ ఆకృతులతో ఉన్న నాగస్వరూపాలు, అందమైన చెట్లును ఏర్పాటు చేశారు. ముందుగా నిర్వహకులు జోగినాథ ఆలయం వద్ద పూజలు నిర్వహించి రథాన్ని కదిలించారు. అనంతరం క్రీడామైదానం వరకు కాగడాలతో ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ రావణాసురుడి వద్ద పూజలు నిర్వహించి వివిధ ఆకృతులతో ఉన్న బాణసంచాలను నిర్వహకులు పేల్చారు. చివరిగా రావణాసురుడి విగ్రహనికి నిప్పంటించారు. ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.
జనసందోహంగా మారిన జోగిపేట..
లంకాదహన కార్యక్రమానికి అందోల్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలే కాకుండా మిగితా గ్రామాలనుంచి ట్రాక్టర్లు, ఆటోలు, వివిధ వాహనాలపై పెద్ద ఎత్తున భక్తులు జోగిపేటకు తరలివచ్చారు. దీంతో జోగిపేట పట్టణ పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి. రాత్రివేళకూడా ఎక్కడ చూసిన జనసంచారమే కనిపించింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ డి.బి.నాగభూషణం, డైరెక్టర్ మల్లికార్జున్‌గుప్త, పట్టణ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చాపల వెంకటేశం, కౌన్సిలర్లు సునిల్‌కుమార్, పిట్ల లక్ష్మన్, మాజీ సర్పంచులు డాకూరి జోగినాథ్, ఎస్.క్రిష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్షులు రామాగౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురేందర్‌గౌడ్, డాకూరి వెంకటేశం, ఆకుల శంకర్, నిర్వహకులు చింతకుంట బిక్షపతి, డాకూరి శంకరయ్య, అల్లె గోపాల్, డాకూరి శివశంకర్, ఆలయ పూజరులు భద్రప్ప, సుజీతప్ప, సిద్ధేశ్వరప్ప, సదానందంతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

 

Joginathaswamy celebrations

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జోగినాథ్‌స్వామి జాతర ఉత్సవాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: