ఆదిలాబాద్ లో అడవుల విధ్వంసం

ఆదిలాబాద్‌ : అడవుల సంరక్షణ కోసం అహర్నిశలు పాటు పడాల్సిన అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు అపఖ్యాతిని మూటగట్టుకుంటూ ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతున్నారు. గత కొన్నేళ్లుగా స్మగ్లర్లతో చేతులు కలిపి వారికి సహకరిస్తూ అటవీ విస్తీర్ణం తగ్గేందుకు కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో అడవుల జిల్లాగా పేరు తెచ్చుకుంది. అయితే క్రమేణా స్మగ్లర్ల వేటుకు అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇటీవల ప్రభుత్వం స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించడంతో పాటు […] The post ఆదిలాబాద్ లో అడవుల విధ్వంసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్‌ : అడవుల సంరక్షణ కోసం అహర్నిశలు పాటు పడాల్సిన అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు అపఖ్యాతిని మూటగట్టుకుంటూ ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతున్నారు. గత కొన్నేళ్లుగా స్మగ్లర్లతో చేతులు కలిపి వారికి సహకరిస్తూ అటవీ విస్తీర్ణం తగ్గేందుకు కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో అడవుల జిల్లాగా పేరు తెచ్చుకుంది. అయితే క్రమేణా స్మగ్లర్ల వేటుకు అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇటీవల ప్రభుత్వం స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించడంతో పాటు స్మగ్లర్లకు సహకరిస్తున్న అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులపై సైతం బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదిలాబాద్ సర్కిల్ కన్జర్వేటర్‌పై సైతం బదిలీ వేటు వేశారు. ఇలా బదిలీ కావడాన్ని కింది స్థాయి ఉద్యోగులు, అధికారులే తీవ్రమైన అవమానంగా భావిస్తారు. అయితే ఏకంగా సీఎఫ్ స్థాయి అధికారిని అడవుల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో బదిలీ చేయడం అప్పట్లో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక సీఎఫ్‌తో పాటు పలువురు డీఎఫ్‌వోలు, ఎఫ్‌డీవోలు, ఎఫ్‌ఆర్‌వోలు, డీఆర్‌వోలు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లను బదిలీ చేశారు. విధులు సక్రమంగా నిర్వహించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికంగా ఉంటూ అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ చెట్ల నరికివేతను సమూలంగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో కంటే భిన్నంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ స్మగ్లర్ల ఆట కట్టించేందుకు కృషి చేస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు, ఉద్యోగులలో మాత్రం మార్పు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అటవీశాఖలో పని చేస్తున్న ఉద్యోగులలో కొందరు స్మగ్లర్లకు సహకరించడంతో పాటు అక్రమ కలప రవాణాలో భాగస్వామ్యులవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కారణంగా ఉమ్మడి జిల్లాలో నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా సిరికొండ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ ముక్తార్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ సీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులను సైతం నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వరసగా అటవీశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు పడుతున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రాకపోవడంపై జిల్లా వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సైతం చెట్లను కాపాడేందుకు ముందుకు వస్తున్న తరుణంలో అటవీశాఖ అధికారులే కలప అక్రమంగా తరలించాలని చూడడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక బుధవారం సస్పెన్షన్‌కు గురైన డీఆర్‌వో ముక్తార్‌అహ్మద్ తన పరిధిలో స్వాధీనం చేసుకున్న కలపతో ఫర్నీచర్‌ను తయారు చేయించుకుంటున్నారని వాయిపేట్ గ్రామస్థులు ఆరోపించారు. దీంతో వెంటనే విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతానికి భిన్నంగా అటవీశాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులే ఇలా కలపను తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడడంపై జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Forest Destruction in Adilabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆదిలాబాద్ లో అడవుల విధ్వంసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: