సంతోషం మన చేతుల్లోనే

మీరు నిజంగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారా?! అయితే ఈ ప్రపంచంలో ఏ శక్తిగానీ, వస్తువుగానీ, వ్యక్తిగానీ మిమ్మల్ని ఆపలేరు.  సంతోషం మీ చేతుల్లోనే ఉంటుందన్నదే నిజం. సంతోషమనేది మన ప్రవర్తన, పరిస్థితులను అర్థం చేసుకునే తీరు, వాటిపై మన స్పందనపై ఆధారపడి ఉంటుంది. సంతోషాన్ని నిర్ణయించే శక్తి వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. కాబట్టి సంతోషం కూడా ఆ కోవలోకే వస్తుంది. అందువల్ల మనం తెలివితో విచారాన్ని దూరం పెట్టి సంతోషాన్ని సొంతం చేసుకునే నిర్ణయాన్ని తీసుకోవాలి. అలా సంతోషాన్ని […] The post సంతోషం మన చేతుల్లోనే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మీరు నిజంగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారా?! అయితే ఈ ప్రపంచంలో ఏ శక్తిగానీ, వస్తువుగానీ, వ్యక్తిగానీ మిమ్మల్ని ఆపలేరు.  సంతోషం మీ చేతుల్లోనే ఉంటుందన్నదే నిజం. సంతోషమనేది మన ప్రవర్తన, పరిస్థితులను అర్థం చేసుకునే తీరు, వాటిపై మన స్పందనపై ఆధారపడి ఉంటుంది. సంతోషాన్ని నిర్ణయించే శక్తి వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. కాబట్టి సంతోషం కూడా ఆ కోవలోకే వస్తుంది. అందువల్ల మనం తెలివితో విచారాన్ని దూరం పెట్టి సంతోషాన్ని సొంతం చేసుకునే నిర్ణయాన్ని తీసుకోవాలి. అలా సంతోషాన్ని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం..

సంతోషాన్ని జీవిత లక్షాలలో మొదటిదానిగా చేసుకున్నప్పుడే దానిని అందుకోగలుగుతారు. వ్యక్తులు ఈ లక్షాన్ని అందుకోవాలంటే ప్రాథమిక బాధ్యతను మన మీదే వేసుకోవాలి. ఇతరుల కోసమో, అదృష్టం కోస మో, డబ్బు లేదా పిల్లలు, భార్యా/భర్త కోసమో వేచి చూడటం సరికాదు. మనందరం కూడా విజయం సాధించడం వల్ల సంతోషం పొందగలమని భావిస్తాం. నిజమే, విజయం కొన్ని క్షణాల పాటు సంతోషాన్నిస్తుంది.  అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మనుష్యులు, తమకు తర్వాత వచ్చే ప్రమోషన్ లేదా మంచి మార్కులు లేదా తదుపరి లక్షాన్ని ఛేదించటంతో ముడి పెట్టుకుంటారు.

ఇలా చేయటంలో ఒక ప్రమాదం దాగి ఉంది. ఎప్పుడో జరిగే విషయాలకు సంతోషాన్ని ముడిపెట్టడం వల్ల అసంతృప్తి అంతర్లీనంగా కొనసాగుతూ ఉంటుంది. సంతోషం నిరంతరం వాయిదా పడుతుంది. అందుచేత, సాధించిన ప్రతిసారీ అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా ఆ విజయాన్ని పండుగ చేసుకోవటం అవసరం.సంతోషాన్ని అనుభవించడానికి చిన్నవైనా, పెద్దదైనా ప్రతి సంతోషాన్ని ఒడిసి పట్టుకోవాలి. కొన్ని సార్లు గతంలో సంతోషకరమైన జ్ఞాపకాలను తిరిగి నెమరువేసుకోవటం, కొత్త జ్ఞాపకాలను తయారు చేసుకోవటం కూడా సంతోషంలో భాగమే. ఒకవేళ మీరు ఉద్యోగి అయివుంటే మీ ఆఫీసు బల్లమీద, ఓ మూల మీకు సంతోషాన్ని కలిగించే వాటిని ఉంచండి. సాధించిన విజయాలకు సంబంధించిన చిరు జ్ఞాపికలు ఉత్సాహాన్ని నింపే కొటేషన్లు, మీ పెదవులపై చిరునవ్వు పూయించగలిగిన ఫొటోలు, మీ హాబీల తాలూకు విషయాలు మొదలైనవి అక్కడ ఉంచుకోండి. వీటిని చూస్తూ ఉంటే జీవితంలోని ప్రతిక్షణం ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ గత జీవితంలో కొన్ని అద్భుత క్షణాలున్నాయని, భవిష్యత్తులో మరిన్ని సంతోషాలు తమ కోసం ఎదురుచూస్తున్నాయన్న భరోసా కలిగి మనస్సు సంతోషంతో నిండుతుంది.

అలాగే భార్యాభర్తల నడుమ శృంగారం తరుచూ అవసరమేనంటున్నారు నిపుణులు. దీని వల్ల వారు సంతోషంంగా, ఆరోగ్యంగా ఉంటారు. బాంధవ్యం మరింత దృఢంగా ఉండి, ఒకరిపట్ల ఒకరి బాధ్యత పెరుగుతుంది. డిప్రెషన్, ఆందోళన వంటివి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మంచినిద్ర పడుతుంది. సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇంకా అనేక రకాల సమస్యలు తగ్గుతాయన్నది నిపుణుల అభిప్రాయం. ఒత్తిడిని దూరం చేయండి కొన్ని అలవాట్లు మనలో ఒత్తిడిని పెంచుతాయి. ఒత్తిడి పెరిగి విచారంగా మారుతుంది. ఇటీవల పరిశోధనలో సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో రెండు గంటల కంటే ఎక్కువ సమయం గడిపే యువత మానసిక ఒత్తిడితో సతమత మవుతున్నట్లు గుర్తించారు.

ఇన్‌స్టాగ్రామ్ వాడేవాళ్లు నిరంతరం సమాజం ప్రతిస్పందనలను గమనిస్తూ ఉంటారు. దీనివల్ల మానసిక ఆరోగ్య సమస్యలైన ఆందోళన, కుంగుబాటు తొలగిపోతాయి. అదేపనిగా సోషల్ మీడియాలో గడిపేవారి శక్తి ఏ విధమైన సానుకూల పరిణామాలు లేకుండానే వృథా అయిపోతుంది. వాటిల్లో మునిగి పోవటం వల్ల వాయిదా మనస్తత్వం పెరుగుతుంది. మన లోపల అపరాధభావం మొదలవుతుంది. అలాగే, మరీ అతిగా, చిన్న పని ప్రణాళిక ప్రకారమే చేయాలనుకుంటే, పట్టికలో ఉన్న పనిని ఒక్కటి పూర్తి చేయలేకపోయినా మనల్ని అప్పుడప్పుడు అసంతృప్తి చుట్టు ముడుతుంది.

లోపాలు ఎంచటమనేది మరో చెడ్డ గుణం. దాని వల్ల జీవితంలో జరిగిన, జరుగుతున్న చెడ్డ విషయాలే గుర్తుకు వస్తాయి. పూర్తిగా పద్ధతిగా ఉండాలి అనుకోవటం కూడా అడ్డంకే. అంతా పద్ధతిగా జరగాలనుకునేవారు తాము సాధించిన విషయాలను సంతోషపడలేరు. ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుంది. దాని వల్ల సంతోషంగా ఉండలేకపోతారు.  ప్రతి చిన్న విషయం పట్టించుకోవటం వల్ల విజయాన్ని సాధించినా సంతోషా న్ని దక్కించుకోలేరు. అందుచేత ఇలాంటి ఒత్తిడి కలిగించి, విచారానికి దారితీసే అలవాట్లను కాస్తంత దూరంగా పెట్టాలి.

వ్యాయామంతో ఆనందం

నడక, వ్యాయామం, ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యం బావుంటుంది. ఆరోగ్యం బావుంటే సంతోషంగా ఉంటుంది. వ్యాయామాలను క్రమం తప్పకుండా కొనసాగించటం వల్ల అనేక ప్రయోజనాలుంటాయన్నది తెలియని విషయం కాదు.  ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో, శరీరాన్ని నాజూకుగా ఉంచడంలో వ్యాయామాల పాత్ర తిరుగులేనిది. అంతేకాదు ఓ ఒత్తిడిని తగ్గించటంలో ఎక్సర్‌సైజలు తిరుగులేనివి. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, జిమ్‌లో ఏవో ఒక కసరత్తులు ఏవి చేసినా గొప్ప ఒత్తిడి నివారించడానికి పనిచేస్తాయి. ముఖ్యంగా ఈత ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. శరీరంలోని అన్ని కండరాలను స్విమ్మింగ్ కదలికలను సరిచేస్తుంది. ఏ ఆటలాడినా అవీ మంచి వ్యాయామాలే కాగలవు.దీనికి వ్యతిరేకంగా ఆందోళన కుంగుబాటు, ఒత్తిడి, మానసిక అలసటను పెంచి ఆరోగ్యాన్ని దూరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఎంతటి హుషారైన వారినైనా ఒత్తిడి అప్పుడప్పుడు కుదిపేస్తుంటుంది. ఒత్తిడి ప్రభావం ఉన్నప్పుడు మెదడు చురుగ్గా ఉండదు. దీని నుంచి బయట పడేందుకు కొందరు అదే పనిగా టీ, కాఫీలు తాగేస్తుంటారు. కొందరు తీపి పదార్థాలు తింటుంటారు.

ఇవేమి కాకుండా, ఒత్తిడిగా ఉన్నప్పుడు కొద్దిసేపు అటూ ఇటూ నడిచినా, మెట్లెక్కి దిగినా ఇట్టే తేడా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ జరిగి ఒత్తిడి అదుపులోకి వస్తుంది.  ఏమాత్రం ఇబ్బంది సమయం అక్కర్లేకుండా కూర్చున్నచోటి నుంచి లేచి ఓ ఐదు నిమిషాలు అటూ ఇటూ పచార్లు కొడితే ఒత్తిడి హుష్ కాకి.

బాధలను పంచుకోండి

* మన హృదయాలకు నిరుత్సాహాన్ని కలిగించే సమస్యలు మనందరికీ ఉన్నాయి.
* కానీ ఇతర వ్యక్తులను కలిసినప్పుడు మీ సమస్యలు చెప్పి వారి గుండె బరువు పెంచకండి.
* మీ మనస్సులో బాధలను ఎదుటివారితో పంచుకుంటే గుండె తేలిక పడవచ్చు. కానీ మీ బాధలకు పరిష్కారాలు అందించలేని వారికి ఏమి ప్రయోజనం? ఇద్దరికీ ఉపయోగం లేదు కదా!
* ఎవరైనా మిమ్మల్ని వారంతట వారు ఎలా ఉన్నారు? అని పలకరిస్తే మీ జీవితంలోని మంచి విషయాలను వారితో పంచుకోండి, దాని వల్ల అందరూ మంచిగా సమయం గడపగలుగుతారు.
* వారు తక్కువమందైనా లేదా దూరంగా ఉన్నా సరే, అందరిలో సంతోషం వ్యాపిస్తుంది. ఇలా జీవితంలోని సంతోషకరమైన క్షణాలను, మంచి విషయాలను ఇతరులతో పంచుకుంటున్నప్పుడు గుండెల్లో సంతోషం పొంగిపొరలుతుంది. ఆ సంతోషం కెరటంలా అందరినీ ముంచెత్తుతుంది.
బిజీ లైఫ్‌లో ప్రతి పనినీ ఆనందంగా చేస్తూ, పనిలో, మనుచుట్టూ ఉన్న మనుషుల్లో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే సంతోషం కచ్చితంగా మన సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

The post సంతోషం మన చేతుల్లోనే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.