మండలంలో నామమాత్రంగా పన్నుల వసూళ్ళు

  సిబ్బంది కొరతే ప్రధాన కారణమా…? వరుస ఎన్నికల ప్రభావమా…? పన్నుల వసూళ్ళకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఎంపిడిఓ మహాలక్ష్మి ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలంలో వసూలయ్యే పన్నులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రామ పంచాయితీలో చెల్లించే ఇంటి పన్ను, నీటి కుళాయి పన్ను వంటి సాధారణ పన్నుల వసూళ్ళలో కూడా పంచాయితి అధికారుల పనితీరు నామమాత్రంగా ఉంది. దీంతో పన్నులు వసూళ్ళు గాక నిధులు లేక మండలంలో అభివృద్ధి కుంటుబడుతోంది. మండలంలో 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను […] The post మండలంలో నామమాత్రంగా పన్నుల వసూళ్ళు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిబ్బంది కొరతే ప్రధాన కారణమా…?
వరుస ఎన్నికల ప్రభావమా…?
పన్నుల వసూళ్ళకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
ఎంపిడిఓ మహాలక్ష్మి

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలంలో వసూలయ్యే పన్నులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రామ పంచాయితీలో చెల్లించే ఇంటి పన్ను, నీటి కుళాయి పన్ను వంటి సాధారణ పన్నుల వసూళ్ళలో కూడా పంచాయితి అధికారుల పనితీరు నామమాత్రంగా ఉంది. దీంతో పన్నులు వసూళ్ళు గాక నిధులు లేక మండలంలో అభివృద్ధి కుంటుబడుతోంది. మండలంలో 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను 22 పంచాయితీల్లో రూ. 48,87,246 పన్నులు వసూలు చేయల్సి ఉండగా పంచాయితి అధికారులు రూ. 21,25,555 మాత్రమే వసూలు చేయగలిగారు. వసూలైన పన్నుల శాతం సగానికంటే తక్కువ.

2018-19 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన పంచాయితీలతో కలిపి మొత్తం 33 పంచాయితీలకు గాను రూ. 77,66,325 వసూలు చేయాల్సి ఉండగా రూ. 35,08,074 మాత్రమే వసూలు చేయగలిగారు. ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి వసూలైన పన్నులు కేవలం 45 శాతం మాత్రమే ఉన్నాయి. పంచాయితీ సిబ్బంది కొరత ఆసక్తి కనబరచకపోవటమే అతి తక్కువ వసూళ్ళకు కారణాలని ఆరోపణలున్నాయి. ఇంతేగాకుండా వరుస ఎన్నికలు కూడా పన్నుల వసూళ్ళపై ప్రభావం చూపుతున్నాయి. పంచాయితి సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో మండలంలో పన్నులు వసూలు చేసేవారు లేరు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయితీ కార్యదర్శులను నియమించటంతో సిబ్బందిపై పని భారం తగ్గటంతో పాటు పన్నుల వసూళ్ళు ఆశాజనకం కానున్నాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మండలంలో కొత్తగా వచ్చిన కార్యదర్శులతో కలిపి 33 పంచాయితీలకు గాను 22 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు.

పన్నుల వసూళ్ళకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్… ఎంపిడిఓ మహాలక్ష్మి
మండలంలోని 33 పంచాయితీల్లో పన్నులు వసూలు చేయటానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంచాయితీల వారీగా రెండు రోజులకు ఒక గ్రామం చొప్పున పెండింగ్‌లో ఉన్న పన్నులను వసూలు చేయనున్నారు. ఎన్నికల అనంతరం కొత్తగా వచ్చిన సిబ్బందితో పాటు పంచాయితీలలో పని చేసే సిబ్బందిని కూడా ఉపయోగించుకుని పన్ను వసూలు శాతం పెంచుతామన్నారు.

Nominal tax collections in Penuballi Mandal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మండలంలో నామమాత్రంగా పన్నుల వసూళ్ళు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: