నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం

జాతరకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలి, లింగాల ఎస్‌ఐ రమేష్   మనతెలంగాణ/అచ్చంపేట : నేటి నుండి ప్రారంభం కానున్న సలేశ్వరం జాతరకు వివిధ రాష్ట్రల నుండి లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. అడవిలో నీటి సౌకర్యం సరిగా ఉండదు కాబట్టి భక్తులు త్రాగునీటిని వెంట తీసుకురావాలని కోరారు. అడవిలో రోడ్డు ఇరుకుగా ఉన్నందున ట్రాఫిక్ నిబంధనలు పాటించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులకు భక్తులు సహకరించాలని […] The post నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జాతరకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలి, లింగాల ఎస్‌ఐ రమేష్

 

మనతెలంగాణ/అచ్చంపేట : నేటి నుండి ప్రారంభం కానున్న సలేశ్వరం జాతరకు వివిధ రాష్ట్రల నుండి లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. అడవిలో నీటి సౌకర్యం సరిగా ఉండదు కాబట్టి భక్తులు త్రాగునీటిని వెంట తీసుకురావాలని కోరారు. అడవిలో రోడ్డు ఇరుకుగా ఉన్నందున ట్రాఫిక్ నిబంధనలు పాటించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులకు భక్తులు సహకరించాలని ఎస్ రమేష్ కోరారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే భక్తులు తప్పని సరిగా హెల్మెంట్ ధరించాలని, లోయలోకి దిగే సమయంలో బందువులు, స్నేహితులు, తోటి వారి సహాయం తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ విషయంలో, దర్శన సమయంలో తోటి భక్తులకు, పోలీసులకు సహకరించాలని కోరారు.

అడవిలో రోడ్డు సరిగా ఉండదు కాబట్టి కండీషన్‌లో ఉన్న వాహనాలు తీసుకుని రాగలరని కోరారు. భక్తులు స్నాన గుండం దగ్గర నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే స్నానం చేయగలరని, ఈత రాని వారు, చిన్న పిల్లలు, మహిళలు గుండంలో స్నానం చేసే సమయంలో ఎటువంటి ప్రమాదం జరుగకుండా తగు జాగ్రత్తలు పాటించగలరని కోరారు. సలేశ్వరం జాతరకు కర్నాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లక్షలాదిగా స్వామి వారిని దర్శించుకుంటారు. పట్టణ ప్రాంత ప్రజలు సలేవ్వర సాహస యాత్ర చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

The post నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: