గర్భిణీ స్త్రీల కోసం అమ్మలాలన సహాయ కేంద్రం…

    వరంగల్: గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా, వారికి మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి హన్మకొండలో “ అమ్మలాలన సహాయ కేంద్రం” ప్రారంభించడం జరిగిందని, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలు పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు తిరిగి 102 ద్వారా ఇంటికి చేరడం వంటి సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా పారా మెడికల్ సిబ్బంది సేవలందిస్తారని ఆయనన్నారు. త్వరలో […] The post గర్భిణీ స్త్రీల కోసం అమ్మలాలన సహాయ కేంద్రం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

వరంగల్: గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా, వారికి మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి హన్మకొండలో “ అమ్మలాలన సహాయ కేంద్రం” ప్రారంభించడం జరిగిందని, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలు పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు తిరిగి 102 ద్వారా ఇంటికి చేరడం వంటి సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా పారా మెడికల్ సిబ్బంది సేవలందిస్తారని ఆయనన్నారు. త్వరలో ప్రసూతి ఆస్పత్రి సికెఎం వరంగల్‌లో కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయినాథ్‌రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ బి.హరీష్‌రాజ్, జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సరళాదేవి, డాక్టర్ మదన్‌మోహన్‌రావు, డిప్యూటి డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎండి.యాకూబ్‌పాషా, డాక్టర్ నవీన్, డిపిఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Help Center for Pregnant Women …

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గర్భిణీ స్త్రీల కోసం అమ్మలాలన సహాయ కేంద్రం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.