యువత డా. బిఆర్ అంబేద్కర్ ను అదర్శంగా తీసుకోవాలి

  మహబూబ్‌నగర్: యువకులు చెడు అలవాట్లకు పోకుండ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని నారాయణ పేట జిల్లా ఎస్ పి చేతన అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కందేన్ పల్లి గ్రామంలో విశ్వమేధావి భారత రాజ్యంగ నిర్మత డాక్టర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను సర్పంచ్ నీత యశోవర్దన్, జిల్లా ఎస్ పి చేతన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వంచారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్ పి చేతన హజరై అంబేద్కర్ విగ్రహానికి […] The post యువత డా. బిఆర్ అంబేద్కర్ ను అదర్శంగా తీసుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్: యువకులు చెడు అలవాట్లకు పోకుండ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని నారాయణ పేట జిల్లా ఎస్ పి చేతన అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కందేన్ పల్లి గ్రామంలో విశ్వమేధావి భారత రాజ్యంగ నిర్మత డాక్టర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను సర్పంచ్ నీత యశోవర్దన్, జిల్లా ఎస్ పి చేతన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వంచారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్ పి చేతన హజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతూ… దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగు రంగుల గోడలు కాదని పౌరుల నైతికభివృద్దే నిజమైన దేశభివృద్ధి అవుతుందన్నారు. రాజ్యంగ నిర్మత డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత కోనసాగించాలని, బడుగు బలహీనుల ఆశా జోతి డా. బిఆర్ అంబేద్కర్ అని అయన సేవలను కోనియాడారు. ఈ కార్యక్రమంలో నరేందర్, రాములు యాదవు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Dr. BR Ambedkar 128th birthday celebration

Related Images:

[See image gallery at manatelangana.news]

The post యువత డా. బిఆర్ అంబేద్కర్ ను అదర్శంగా తీసుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: