ఉద్యమనేతకు ఎమ్మెల్సీ కిరీటం

మెదక్ :  ఉద్యమనేత శేరి సుభాష్‌రెడ్డికి ఎమ్మెల్సీ కిరీటం దక్కింది. టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అడుగులో అడుగువేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనకు  అహర్నిశలు కృషి చేసిన శేరి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శేరి సుభాష్‌రెడ్డి అంచెలంచెలుగా రాజకీయాల్లో  ఎదిగి గతంలో ఖనిజ సంపద చైర్మన్‌గా పని చేశారు. శేరి సుభాష్‌రెడ్డిని  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలుపొందారు. శేరి సుభాష్‌రెడ్డి 2001లో టిఆర్‌ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. 2011నుంచి సిఎం కెసిఆర్‌కు రాజకీయ కార్యదర్శిగా […] The post ఉద్యమనేతకు ఎమ్మెల్సీ కిరీటం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్ :  ఉద్యమనేత శేరి సుభాష్‌రెడ్డికి ఎమ్మెల్సీ కిరీటం దక్కింది. టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అడుగులో అడుగువేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనకు  అహర్నిశలు కృషి చేసిన శేరి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శేరి సుభాష్‌రెడ్డి అంచెలంచెలుగా రాజకీయాల్లో  ఎదిగి గతంలో ఖనిజ సంపద చైర్మన్‌గా పని చేశారు. శేరి సుభాష్‌రెడ్డిని  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలుపొందారు. శేరి సుభాష్‌రెడ్డి 2001లో టిఆర్‌ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. 2011నుంచి సిఎం కెసిఆర్‌కు రాజకీయ కార్యదర్శిగా బాధ్యతలు కొనసాగించారు. 2016లో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా సిఎం కెసిఆర్ శేరి సుభాష్‌రెడ్డికి  అవకాశం ఇవ్వడంతో సొంత జిల్లా అయిన మెదక్ లో  ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి. హవేళిఘనపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన శేరి సుభాష్‌రెడ్డి ఈనెల 15న హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. కూచన్‌పల్లి గ్రామానికి చెందిన విఠల్‌రెడ్డి సుశీల దంపతులకు 17 ఆగష్టు 1962లో శేరి సుభాష్‌రెడ్డి జన్మించారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన శేరి సుభాష్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవీ దక్కడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Shaeri Subhash Reddy Elect as MLC

The post ఉద్యమనేతకు ఎమ్మెల్సీ కిరీటం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: