అదనపు వరకట్నం వేధింపులతో వివాహిత మృతి

  కరీంనగర్: మండలంలో అదనపు వరకట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. సైదాపూర్ పోలీసుల కథనం ప్రకారం… సైదాపూర్ మండలం బోమ్మకల్ గ్రామానికి చెందిన గొల్లపల్లి సంధ్యరాణి(23)ను హుజురాబాద్ మండలం పెద్దపపయ్యపల్లే గ్రామానికి చెందిన చల్లురి సురేష్‌కు ఇచ్చి 2018 డిసెంబర్‌లో వివాహాం చేశారు. వివాహాం సమయంలో కట్నకానుకలతోపాటు కట్నం ఇచ్చారు. అయితే అదనపు వరకట్నం తీసుకురావాలంటూ… భర్త సురేష్, అత్త, బావలు, యారాలు నిత్యం మానసికంగా, […] The post అదనపు వరకట్నం వేధింపులతో వివాహిత మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్: మండలంలో అదనపు వరకట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. సైదాపూర్ పోలీసుల కథనం ప్రకారం… సైదాపూర్ మండలం బోమ్మకల్ గ్రామానికి చెందిన గొల్లపల్లి సంధ్యరాణి(23)ను హుజురాబాద్ మండలం పెద్దపపయ్యపల్లే గ్రామానికి చెందిన చల్లురి సురేష్‌కు ఇచ్చి 2018 డిసెంబర్‌లో వివాహాం చేశారు. వివాహాం సమయంలో కట్నకానుకలతోపాటు కట్నం ఇచ్చారు. అయితే అదనపు వరకట్నం తీసుకురావాలంటూ… భర్త సురేష్, అత్త, బావలు, యారాలు నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించటంతో బోమ్మకల్‌లోని తల్లి గారి ఇంటికి చెరింది. దీంతో తీవ్ర మనోవేదకు గురైన సంధ్యరాణి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్‌కు చిరతో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రలు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి సదానందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నూతి శ్రీధర్ తెలిపారు.

Woman Suicide with Additional dowry harassment

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అదనపు వరకట్నం వేధింపులతో వివాహిత మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.