ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్

వరంగల్ క్రైం: ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకొని  బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను బుధవారం సిసి ఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి నుంచి సుమారు రూ.లక్ష విలువ గల 30 గ్రాముల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, దువ్వ గ్రామానికి చెందిన గండికోట నూకాలమ్మ అలియాస్ ఉయ్యాల కుమారి, ఉయ్యాల […] The post ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్ క్రైం: ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకొని  బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను బుధవారం సిసి ఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి నుంచి సుమారు రూ.లక్ష విలువ గల 30 గ్రాముల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, దువ్వ గ్రామానికి చెందిన గండికోట నూకాలమ్మ అలియాస్ ఉయ్యాల కుమారి, ఉయ్యాల మరియమ్మ అలియాస్ బుజ్జిలను పోలీసులు అరెస్ట్ చేశారు. గండికోట కడమ్మ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు.  పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితురాళ్లు స్నేహితులు కావడంతో పాటు ఇద్దరు కలిసి రోజువారీ కూలీ పనులకు కలిసి వెళ్లేవారు. ఇలా వచ్చిన కూలీ డబ్బులతో ఇద్దరు జల్సాలు చేసేవారు. జల్సాకు అలవాటు పడిన వీరు ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించే మహిళల బ్యాగుల్లో బంగారు ఆభరణాలను చోరీ చేసేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారు. ఈ క్రమంలో 2013 నుంచి 2017 మధ్య కాలంలో నిందితురాళ్లు మరో నిందితురాళు కడమ్మతో కలిసి విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆటోల్లో మహిళా ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ ముగ్గురు నిందితురాళ్లను 2017లో ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. నిందితురాళ్లు మారోమారు ఆటోల్లో చోరీ చేసేందుకుగాను వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా వరంగల్ ఎసిపి నర్సయ్యకు సమాచారం వచ్చింది. దీంతో ఎసిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజు, ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఎస్సై అశోక్‌కుమార్‌లు తమ సిబ్బందితో కలిసి వరంగల్ కాశిబుగ్గ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న  ఇద్దరు మహిళలను అరెస్టు చేసి విచారించారు. వీరు చోరీలకు పాల్పడుతున్నట్టు  పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో వీరి నుంచి పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా దొంగలను అరెస్టు చేయడంలో  ప్రతిభ కనబరిచిన వరంగల్ ఎసిపి నర్సయ్య, సిసిఎస్ ఇంతేజార్‌గంజ్ ఇన్స్‌పెక్టర్లు డేవిడ్‌రాజ్, శ్రీధర్, ఎస్సై అశోక్‌కుమార్, సిసిఎస్, ఎస్సై ఫర్వీన్, హెడ్‌కానిస్టేబుళ్లు రవికుమార్, జంపయ్య కానిస్టేబుళ్లు మహ్మద్‌అలీ, ఇంతేజార్‌గంజ్ హెడ్ పోలీస్ కానిస్టేబుల్ రవీందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు మీర్ మహ్మద్ అలీ, సంతోష్, నరేష్, రాంరెడ్డి, కుమారస్వామి, మహిళా కానిస్టేబుల్ కవితలను సిపి రవీందర్ అభినందించారు.

2Women Thieves Arrest in Warangal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: