విద్యుత్ షాక్ తో మైనర్ బాలిక మృతి

  మహబూబ్‌నగర్: మండలంలో పండుగ రోజున పోలం దగ్గర విద్యుత్ షాక్ తగిలి మైనర్ బాలిక మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని దామరగిద్ద మండలం విఠలపూర్ గ్రామంలో పెంటప్ప బతుకు దేరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి మేకలను మెపుకుంటూ జీవనం కోనసాగిస్తున్నాడు. అయితే ఉగాది పండుగ రోజు మద్యాహ్నాం సమయంలో పెంటప్ప కుతురు నవనిత (14) మేకలను మేపుతుండగా దాహం వేయడంతో నీల్లు తాగడానికి పక్కనే […] The post విద్యుత్ షాక్ తో మైనర్ బాలిక మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్: మండలంలో పండుగ రోజున పోలం దగ్గర విద్యుత్ షాక్ తగిలి మైనర్ బాలిక మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని దామరగిద్ద మండలం విఠలపూర్ గ్రామంలో పెంటప్ప బతుకు దేరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి మేకలను మెపుకుంటూ జీవనం కోనసాగిస్తున్నాడు. అయితే ఉగాది పండుగ రోజు మద్యాహ్నాం సమయంలో పెంటప్ప కుతురు నవనిత (14) మేకలను మేపుతుండగా దాహం వేయడంతో నీల్లు తాగడానికి పక్కనే ఉన్న వ్యవసాయ బోరు దగ్గరకు వెళ్ళడంతో పోలంలో ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ తగిలి బాలికతో పాటు ఒక మేక కూడ మృతి చెందింది. మృతి చెందడంతో పండగ రోజున గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయం ఎస్ఐ రాంబాబును వివరణ అడగగా ఇంత వరకు ఎలాంటి ఫిిర్యాదులు మా దృష్టికి రాలేదని తెలిపారు.

బాలిక మృతిపై గ్రామపెద్దలు పంచాయితి..?
విద్యుత్ షాక్ తో పోలం దగ్గర మైనర్ బాలిక మృతి చెందడంతో గుట్టు చప్పుడు కాకుండా గ్రామ పెద్దలు పంచాయితి పెట్టి పోలం యజామాని దగ్గర నుంచి 30వేలు రూపాయలను మృతి చెందిన కుటుంబానికి ఇవ్వాలని పంచాయితిలో నిర్ణయించినట్లు సమాచారం తెలిసింది.

Minor Girl died with Electric Shock in Mahaboobnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విద్యుత్ షాక్ తో మైనర్ బాలిక మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: