సానుకూల దృక్పథంతో ఆనందం!

  ఒక అమీర్‌ఖాన్ సినిమాలో ఆల్ ఈజ్ వెల్ అన్న పదం వినిపిస్తూ ఉంటుంది. అందరూ బాగుండాలి అనేది మనం కూడా ఇష్టపడే పదమే. ఈ పాజిటివ్ ఫీలింగ్ మనుష్యుల జీవితాన్ని వెలిగిస్తుంది అంటారు ఎక్స్‌పర్ట్. ఈ ఒక్కపదం మనసులో నిలుపుకొంటే భయం వేయదు. ఈ పని చేయగలనా లేదా అన్న అపనమ్మకం, ఊగిసలాట ఉం డదు. ఆత్మస్థైర్యం పెరుగుతోంది. ఒత్తిడి వంటి వ్యతిరేక అంశాలు మాయం అవుతాయి. హాయిగా రిలాక్స్‌గా ఉంటారు. పనిలో సృజనాత్మకత పెరుగుతుంది. […] The post సానుకూల దృక్పథంతో ఆనందం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒక అమీర్‌ఖాన్ సినిమాలో ఆల్ ఈజ్ వెల్ అన్న పదం వినిపిస్తూ ఉంటుంది. అందరూ బాగుండాలి అనేది మనం కూడా ఇష్టపడే పదమే. ఈ పాజిటివ్ ఫీలింగ్ మనుష్యుల జీవితాన్ని వెలిగిస్తుంది అంటారు ఎక్స్‌పర్ట్. ఈ ఒక్కపదం మనసులో నిలుపుకొంటే భయం వేయదు. ఈ పని చేయగలనా లేదా అన్న అపనమ్మకం, ఊగిసలాట ఉం డదు. ఆత్మస్థైర్యం పెరుగుతోంది. ఒత్తిడి వంటి వ్యతిరేక అంశాలు మాయం అవుతాయి. హాయిగా రిలాక్స్‌గా ఉంటారు.

పనిలో సృజనాత్మకత పెరుగుతుంది. మనతో పాటు పది మందినీ కలుపుకొని పోగలుగుతాం. ఇవన్నీ ఎక్స్‌పర్ట్ చెప్పే విషయాలు నమ్మవలసిన అంశాలు కూడా. సమస్యలు ఇబ్బందులు వస్తే వాటిని అర్థం చేసుకొని విశ్లేషించి అంగీకరించి పరిష్కరించ గలిగిన పాజిటివ్ దృక్పథం మనిషికి చాలా అవసరం. ఈ పాజిటివ్ భావాలు స్థిరంగా ఉంటే మనిషి లోని సర్వశక్తిలూ బయటికి వస్తాయి. అప్పుడే ఆల్ ఈజ్ వెల్ అన్న పదం ధైర్యంగా పైకి చెప్పగలం… ఈ భావన మనలో పుట్టినప్పటి నుంచి ఉందా? కొందరికే ఉంటుందా? ఇలా పాజిటివ్‌గా జీవితాలంటే ఏం చేయాలి అంటే ఈ భావాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా జీవితం లో ఏదయినా సమస్య ఎదురైతే ముందుగా కంగారు పడటం సహజం. అప్పుడే గందరగోళం లేకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి.

మనల్ని మనం సమీక్షించుకోవాలి. మనలోని భౌతిక, మానసిక భావోద్వేగ శక్తులను సమీకరించుకోవాలి. సమస్యలోంచి బయట పడేందుకు మనస్సు ఎన్నో మార్గాలు సూచిస్తూ ఉంటుంది. తక్షణం బయట పడేందుకు ఏదో ఒక దారి ఎంచుకోవటం ప్రమాదం. మంచి, చెడు సంవాదం మనసులో మొదలవుతుంది. అది చెడ్డ దరి అయితే, దాన్ని బలపరిచే నెగిటివ్ ఫీలింగ్ ని బలవంతంగా బయటకు నెట్టి మంచి మార్గానికీ మొగ్గేలా మనసుకి శిక్షణ ఇస్తే చాలు.

ఏ కష్ట సమయంలో అయినా పాజిటివ్‌గానే ఆలోచించే శక్తి మనలో ఉన్నట్లే… అంటే ఈ శక్తిని మనం ఏ సమయంలో అయినా ఏ వ యసులో అయినాసాధించవచ్చు. ఆత్మ స్థైర్యంతో నిలబడగలిగితే ఈ సానుకూల వైఖరిలో దేన్నయినా సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌పర్ట్ ఏం చె బుతున్నారంటే ఈ సానుకూల వైఖరి కోసం మనసుని,శరీరాన్ని బలంగా ఉంచుకోవాలంటే ఒకటి శరీరాన్ని శక్తివంతం చేసే వ్యాయామం, రెండవది చక్కని పోషకాహారం కావాలంటారు. వ్యాయామంలో శరీరం మనసు చురుగ్గా అవుతాయి.

మనుషుల మూడ్‌లో ఉంచేది మంచి ఆహారం. భావోద్వేగాలు రెచ్చగొట్టే ఆహారం చిక్కులు తెచ్చిపెడుతుంది. సాత్వికాహారం తీసుకోవా లి. ఉద్రేగాలను రెచ్చగొట్టే మసాలాలకు దూరంగా ఉండాలి. ఏ రుతువులో తాజాగా, సవ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకొని శరీరం కోరుకొన్నంత పరిమాణంలోనే తీసుకోవాలి. అలాగే ప్రకృతితో మమేకం అవటం కూడా మనశ్శరీరాలకు చాలా అవసరం. ప్రకృతి ద్వారా మనిషికి అందే ప్రయోజనాలు అనేకం. ప్రతిరోజూ సూర్యకాంతిలో హాయిగా వాకింగ్ చేయాలి.

క్రమం తప్పని వ్యాయామాలు దైనందిన ఆందోళనకు దూరం అయ్యేందు కు సహకరిస్తాయి. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలన్నది ఎవరికి వాళ్లు ఇచ్చుకోగలిగే ఉత్తమమైన గిఫ్ట్ కూడా. యోగా, ప్రాణాయామం, ధ్యానం, మార్షల్ ఆర్ట్ విశ్రాంతి పూరిత మానసిక స్థితిని ఇస్తాయి. శారీరక వ్యాయామాలు క్రీడలు ఎండార్ఫిన్‌లు విడుదల చేస్తాయి. ఇవి సంతోషాన్ని రిలాక్సేషన్‌ని ఇస్తాయి.

ఈ శక్తితో సమస్యలు ఎదుర్కోగలమన్న పాజిటివ్ ఫీలింగ్ కూడా వెంటనే కలుగుతోంది. అంటే మనిషి సంపూర్ణమైన శాంతితో కూ డిన జీవితం గడుపుతూ ఉంటేనే సానుకూల వైఖరి సొంతం అవుతుంది. మరి జీవితంలో ఇబ్బందులు రావా? సమస్యలు లేవా? అంటే ఉంటాయి వస్తాయి. అలాంటి సమయంలోనే సానుకూల వైఖరితో ఆ ఇబ్బందులని అధికమించాలి అంటారు ఎక్స్‌పర్ట్. మరి జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అంటే చుట్టూ స్నేహితులుండాలి. బంధువులుండాలి. అందరితో సంయమనంతో వ్యవహరించాలి.

ధ్యానంలో ఒక పాజిటివ్ ఫీలింగ్‌ను తెచ్చుకోమంటారు. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోమంటారు. మనసుని కేంద్రీకరించమంటారు. ఎంత వరకు చేయగలిగినా మంచిదే కదా ఓ అరగంట శరీరాన్ని మన కంట్రోల్ లోకి తీసుకొని మనస్సుని ఏ ఆలోచనవైపుకూ వెళ్ల నీయకుండా అదుపులో ఉంచితే పాజిటివ్ ఫీలింగ్స్‌తో నింపినట్లేగా ఆ పాజిటివ్ ఎనర్జీ సరిపోదా జీవితాంతం శాంతిగా ఉండేందుకు. అంత శక్తి గనుక మనసుకి వస్తే ప్రపంచానికి ఆల్‌ఈజ్‌వెల్; అని నవ్వుతూ చెప్పేయగలం. ఆశక్తితో మనసు ప్రతి మార్పును అంగీకరిస్తుంది. ప్రతికొత్తదనాన్ని స్వాగతిస్తుంది. ఎదుటివాళ్ల తప్పుల్ని, పొరపాట్లని పట్టించుకోకుండా చిరునవ్వుతో క్షమించమంటుంది. ఎదుటి మనిషితో నెగిటివ్ ఆలోచనను చూడమంటుంది. ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూసే శక్తి మనకి వస్తుంది. ఆ శక్తితో సర్వ ప్రకృతి కలసి భగవంతుడు చేసే ఆనంద తాండవాన్ని దర్శించవచ్చు. వెన్నెల వెలుగులన్నీ ఆ కళ్ల లోంచే తోటి మనుషుల పైన పువ్వుల్లా రాలిపడతాయి.

Positive feeling lights the lives of people

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సానుకూల దృక్పథంతో ఆనందం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: