టిఆర్‌ఎస్‌లో చేరిన గ్రామ సర్పంచులు..

నారాయణపేట :కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్చందంగా పార్టీలో చేరుతున్నారని ఎంఎల్ఏ ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బిఎల్‌ఎఫ్ పార్టీ మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్ అంజమ్మ, ఉపసర్పంచు తాయమ్మ, మేక హనుమాన్ తాండ సర్పంచ్ నీలిబాయి తో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు ఎంఎల్ఏ ఎస్.రాజేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ ఎస్.రాజేందర్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువలు కప్పి పార్టీలోకి […] The post టిఆర్‌ఎస్‌లో చేరిన గ్రామ సర్పంచులు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నారాయణపేట :కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్చందంగా పార్టీలో చేరుతున్నారని ఎంఎల్ఏ ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బిఎల్‌ఎఫ్ పార్టీ మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్ అంజమ్మ, ఉపసర్పంచు తాయమ్మ, మేక హనుమాన్ తాండ సర్పంచ్ నీలిబాయి తో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు ఎంఎల్ఏ ఎస్.రాజేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ ఎస్.రాజేందర్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించిందని మరిన్ని పథకాల అమలు టిఆర్‌ఎస్ ద్వారనే సాధ్యమన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి పాటుపడ్డారన్నారు. ప్రజలకు కెసిఆర్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా పార్లమెంట్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మోజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వేపూరి రాములు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు నర్సింహారెడ్డి, మాజీ మార్కెట్ కమీటి చైర్మన్ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Two Village Sarpanches Joins Trs Party

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్‌ఎస్‌లో చేరిన గ్రామ సర్పంచులు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: