నా గెలుపు ఖాయం : గోడం నగేష్

ఉట్నూర్ రూరల్‌ (ఆదిలాబాద్) :  పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపిగా గెలువడం ఖాయమని ఆదిలాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి గోడం నగేష్ దీమా వ్యక్తం చేశారు. గురువారం ఉట్నూర్ మండలంలోని రామగూడా, లక్కరాం, ఉట్నూర్ పట్టణంలో ఆయన ఇటింటికి ప్రచారం నిర్వహించారు. రామాగూడాలో  ఎంపి నగేష్, ఎమ్మెల్యే రేఖానాయక్‌లను ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా నగేష్ మాట్లాడుతూ తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్దిగా చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమంపై […] The post నా గెలుపు ఖాయం : గోడం నగేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉట్నూర్ రూరల్‌ (ఆదిలాబాద్) :  పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపిగా గెలువడం ఖాయమని ఆదిలాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి గోడం నగేష్ దీమా వ్యక్తం చేశారు. గురువారం ఉట్నూర్ మండలంలోని రామగూడా, లక్కరాం, ఉట్నూర్ పట్టణంలో ఆయన ఇటింటికి ప్రచారం నిర్వహించారు. రామాగూడాలో  ఎంపి నగేష్, ఎమ్మెల్యే రేఖానాయక్‌లను ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా నగేష్ మాట్లాడుతూ తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్దిగా చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమంపై కేసిఆర్ దృష్టి సారించారని తెలిపారు. గతంలో 6 గంటల కూడా కరెంట్ ఉండేదికాదని, కాని ఇప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తుందని పేర్కొన్నారు. షాద్ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలతో నిరుపేద ఆడబిడ్డలను కేసిఆర్ ఆదుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తప్ప మిగితా పార్టీలకు భవిషత్ ఉండదన్నారు. మళ్ళీ ఎంపిగా అవకాశం కల్పించి కారు గుర్తేకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే రేఖానాయక్, ఏటిడబ్లూసి చైర్మన్ కనక లక్కేరావ్, పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

Godam Nagesh Election Campaign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నా గెలుపు ఖాయం : గోడం నగేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: