ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనపోరాటం

  వరంగల్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు గత రెండు రోజుల నుండి మౌన పోరాటం చేస్తున్న విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని పోచమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని రేఖ్యనాయక్ తండాకు చెందిన బానోతు రోజా(21) అదే తండాకు చెందిన మాలోతు రాజు(23) వీరు గత మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం […]

 

వరంగల్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు గత రెండు రోజుల నుండి మౌన పోరాటం చేస్తున్న విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని పోచమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని రేఖ్యనాయక్ తండాకు చెందిన బానోతు రోజా(21) అదే తండాకు చెందిన మాలోతు రాజు(23) వీరు గత మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి పెళ్లికి అంగికరించారు. రోజా తల్లిదండ్రులు పెళ్లికి కట్న కానుకలిచ్చి పెళ్లి చేస్తామని అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పడంతో దానికి రాజు తల్లిదండ్రులు కూడా  ఒప్పుకున్నారు. ఇంతలోనే మాలోతు రాజు బంధువుల పెళ్లికి వచ్చిన తరువాత మనసు మార్చుకొని తను రోజాను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఒక్కసారి అవాక్కయిపోయింది. ప్రియుడు రాజ ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటం చేస్తుంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగరాజు రేఖ్యనాయక్ తండాకు చేరుకొని రోజాతో మాట్లాడి నీకు తగిన న్యాయం చేస్తానని చెప్పారు. ఎస్ఐ మాలోతు రాజుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

A Girl Protest her Boyfriend’s house

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: