ఆఫీసులో పచ్చదనం..

    వర్క్ టెన్షన్ ఈ మధ్య ఎవరిని కదిలించినా ఇదే మాట వినిపిస్తుంటుంది. ఆఫీసులో కూడా ఆహ్లాదకరంగా పనిచేసుకోవాలంటే పచ్చని చెట్టు పెంచుకుంటే సరిపోతుంది.  స్థలం ఎక్కువగా ఆక్రమించకుండా.. తక్కువ స్థలంలో ఎత్తు ఎక్కువగా పెరగని మొక్కను ఎంపిక చేసుకోవాలి. ఎడారి మొక్కలు, హెర్బల్ ప్లాంట్లు, సక్యులెంట్లు బాగుంటాయి. మట్టి అవసరం లేకుండా నీళ్లు లేదంటే గాలితో బతికే మొక్కలు అందుబాటులోకి వస్తున్నాయి. గాజు సీసాలోనో, చిన్న స్టాండ్‌లోనో పెట్టవచ్చు. ఒకవేళ కుండీ అయితే తరచూ […]

 

 

వర్క్ టెన్షన్ ఈ మధ్య ఎవరిని కదిలించినా ఇదే మాట వినిపిస్తుంటుంది. ఆఫీసులో కూడా ఆహ్లాదకరంగా పనిచేసుకోవాలంటే పచ్చని చెట్టు పెంచుకుంటే సరిపోతుంది.  స్థలం ఎక్కువగా ఆక్రమించకుండా.. తక్కువ స్థలంలో ఎత్తు ఎక్కువగా పెరగని మొక్కను ఎంపిక చేసుకోవాలి. ఎడారి మొక్కలు, హెర్బల్ ప్లాంట్లు, సక్యులెంట్లు బాగుంటాయి. మట్టి అవసరం లేకుండా నీళ్లు లేదంటే గాలితో బతికే మొక్కలు అందుబాటులోకి వస్తున్నాయి.

గాజు సీసాలోనో, చిన్న స్టాండ్‌లోనో పెట్టవచ్చు. ఒకవేళ కుండీ అయితే తరచూ నీళ్లు పోయాలి. అలాగని పనిచేసే చోట నీళ్లు పోయడం, అవి కారడం ఇబ్బంది. అందుకే ఫోమ్‌ని తడిపి మొక్క మొదట్లో ఉంచాలి. దీనివల్ల తేమ సరిపడా ఉంటుంది. అప్పుడప్పుడూ మట్టి మార్చుకుంటే చాలు. ఈ మొక్కలు ఎప్పటికప్పుడు ఎత్తు పెరగకుండా కత్తిరించుకోవాలి. చీడ, ఎండిపోయిన కొమ్మలు ఉంటే వెంటనే తీసేయాలి. అప్పుడప్పుడూ కొమ్మల మీద నీళ్లు చల్లాలి. ఆకులు తాజాగా ఉంటాయి. వాటిపైన పేరుకున్న దుమ్ము ధూళీ తొలగిపోతాయి.