దివ్యాంగులకు వాటా ఉండాలి: కవిత

  నిజామాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఎంపి కవిత తెలిపారు. మంగళవారం నిజామాబాద్ బృందావన్ గార్డెన్స్ లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సభలో కవిత మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో దివ్యాంగులకు వాటా ఉండాలని డిమాండ్ చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపి నిధుల నుంచి దివ్యాంగుల వాహనాలకు 58 లక్షల రూపాయలు మంజూరు చేశానని వెల్లడించారు. మన ప్రయాణం చేస్తున్నప్పుడు కష్టాలు వస్తాయని అవి ఏమీ తనని ఆపలేవన్నారు. కష్టాలు […]

 

నిజామాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఎంపి కవిత తెలిపారు. మంగళవారం నిజామాబాద్ బృందావన్ గార్డెన్స్ లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సభలో కవిత మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో దివ్యాంగులకు వాటా ఉండాలని డిమాండ్ చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపి నిధుల నుంచి దివ్యాంగుల వాహనాలకు 58 లక్షల రూపాయలు మంజూరు చేశానని వెల్లడించారు. మన ప్రయాణం చేస్తున్నప్పుడు కష్టాలు వస్తాయని అవి ఏమీ తనని ఆపలేవన్నారు. కష్టాలు మనకు దైర్యాన్ని వెలికితీస్తాయని కవిత చెప్పారు. 

 

Handicapped Share in Government Schemes: Kavitha