ఖమ్మంలో నామా ప్రచారం

ఖమ్మం: ఖమ్మం టిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవని, తెలంగాణ ఆవిర్భావం తరువత కెసిఆర్ పాలనలో కరెంట్ కోతలే లేవని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని […]

ఖమ్మం: ఖమ్మం టిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవని, తెలంగాణ ఆవిర్భావం తరువత కెసిఆర్ పాలనలో కరెంట్ కోతలే లేవని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో ఖమ్మం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. జిల్లాలో తాగునీటి సమస్య దాదాపుగా తీరిందని చెప్పారు. తన గెలుపు ఎప్పడో ఖాయమైందని, భారీ మెజార్టీని తెచ్చి పెట్టాలని ఆయన ప్రజలను కోరారు. తన విజయం కోసం టిఆర్ఎస్ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

TRS Candidate Nama Campaign in Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]