హరీష్ రావుకు తప్పిన ప్రమాదం

మెదక్: టిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీష్ రావుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తుప్రాన్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న హరీష్ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. హరీష్ ప్రసంగిస్తున్న సమయంలో వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే వాహనం దిగి దూరంగా వెళ్లిపోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హరీష్ తోపాటు ఎంఎల్ఎ మదన్ రెడ్డి, ఎంఎల్సీ ఫరూక్ హుస్సేన్, ఇతర టిఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి అందరూ […]

మెదక్: టిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీష్ రావుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తుప్రాన్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న హరీష్ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. హరీష్ ప్రసంగిస్తున్న సమయంలో వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే వాహనం దిగి దూరంగా వెళ్లిపోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హరీష్ తోపాటు ఎంఎల్ఎ మదన్ రెడ్డి, ఎంఎల్సీ ఫరూక్ హుస్సేన్, ఇతర టిఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MLA Harish Rao Escape frome Fire Accident in Toopran

Related Stories: