కంచాన్నీ తినేయండి…!

  ఒకప్పుడు అందరూ విందు భోజనానికెళ్తే అరిటాకులు, స్టీలు గ్లాసులు కనిపించేవి. తర్వాత వాటిస్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు చోటుచేసుకున్నాయి. తినేదానికీ తాగేదానికీ అన్నింటికీ ప్లాస్టిక్‌తోనే అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పడా సమస్యకు చెక్ పెట్టారు వ్యాపారస్తులు. ప్లేట్లు, గ్లాసుల్లో ఉన్న ఆహారంతోపాటు వాటినీ ఎంచక్కా తినేయొచ్చు.  మనిషి జీవితంలో ‘ యూజ్ అండ్ త్రో’ వస్తువులకు ప్రాధాన్యం పెరిగి పోయింది. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక పేపర్ ప్లేట్లు కావాలంటే […]

 

ఒకప్పుడు అందరూ విందు భోజనానికెళ్తే అరిటాకులు, స్టీలు గ్లాసులు కనిపించేవి. తర్వాత వాటిస్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు చోటుచేసుకున్నాయి. తినేదానికీ తాగేదానికీ అన్నింటికీ ప్లాస్టిక్‌తోనే అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పడా సమస్యకు చెక్ పెట్టారు వ్యాపారస్తులు. ప్లేట్లు, గ్లాసుల్లో ఉన్న ఆహారంతోపాటు వాటినీ ఎంచక్కా తినేయొచ్చు. 

మనిషి జీవితంలో ‘ యూజ్ అండ్ త్రో’ వస్తువులకు ప్రాధాన్యం పెరిగి పోయింది. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక పేపర్ ప్లేట్లు కావాలంటే ఎన్నో చెట్లను నరకాలి. అందుకే ప్లాస్టిక్ పళ్లాలకు , స్పూన్లకుసెలివిచ్చి…. ‘ఎడిబుల్ కట్లెరీ’కి సై అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. కంచాల్లో తినండి… చివర్లో కంచాన్ని సైతం తినేయండి’ అని చెబుతున్నారు వీటి తయారీదారులు. ఆ కంచాల్ని ప్రత్కేకంగా జొన్నలు, రాగులు వంటి మిల్లెట్స్‌తో తయారు చేస్తారు. తృణ ధాన్యాల్ని తినడం వల్ల శరీరానికి శక్తి కూడా చేకూరుతుంది. మనదేశంలో అనేక సంస్థలు ఎడిబుల్ కట్లెరీని తయారు చేస్తున్నాయి. చిన్న చిన్న పాత్రలూ, కాఫీ కప్పులనూ రూపొందిస్తున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన పీసపాటి నారాయణ ఎనిమిదేళ్ళుగా ఇదే వ్యాపారంలో ఉన్నారు. ఇక్రిశాట్‌లో సైంటిస్టు ఉద్యోగానికి సెలవిచ్చి మరీ ఈ రంగంలోకి దిగారు. బేకీస్ పేరుతో తినే స్పూన్లను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. వీటిని తెప్పించుకున్న గుజరాత్ కుర్రాడు క్రువ్లి పటేల్ కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు. ‘త్రిశూల’ బ్రాండ్ పేరుతో జోరుగా విక్రయిస్తున్నాడు. మరో అడుగు ముందుకేసి సువాసనల స్పూన్లనూ అమ్ముతున్నాడు. బీట్‌రూట్, పాలకూర, చాకొలెట్, మిరియాలు,మసాలా.. ఇలా అనేక రకాల ఫ్లేవర్ల స్పూన్లు అతని దగ్గర లభిస్తాయి.

మొదలు పెట్టిన నాలుగు నెలల్లోనే యాభైవేల స్పూన్లను అమ్మగలిగాడు. ఇప్పుడు మలేషియా, ఆస్ట్రేలియా, నార్వే, దక్షిణాఫ్రికాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఎలాంటి నిల్వ పదార్థాలు కలపకపోయినా స్పూన్లు ఆరు నెలలు చెక్కు చెదరకుండా ఉంటాయనీ, కరకరా నమిలి తినేయొచ్చనీ చెబుతున్నాడు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా చెరకు పిప్పితో చేసిన ప్లేట్లను తయారు చేసింది బెంగుళూరు అమ్మాయి సమన్వి. విన్‌ఫోర్టెక్ పేరుతో ఓ సంస్థను స్థాపించి చెరకుపిప్పి కంచాలను అందిస్తోందీ ఈ యువతీ. వాటికి మంచి ఆదరణే లభిస్తోంది. మొత్తానికి పర్యావరణ హితానికి తమ వంతు బాధ్యతగా ప్రవరిస్తున్నారు వీరంతా. వీటి అమ్మకాలు కూడా జోరందుకుంటున్నాయి.

Biodegradable Edible Spoons As Alternative To Plastic

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: