కాంగ్రెస్ పరిస్థితి ఓటమికి తక్కువ.. డిపాజిట్ కు ఎక్కువ

నర్సాపూర్: మెదక్ ఎంపి అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హరీష్ రావు నర్సాపూర్ లో టిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి గత ఐదేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. నిధుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. అంతేకాకుండా తెలంగాణ ఎంపికి మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి […]

నర్సాపూర్: మెదక్ ఎంపి అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హరీష్ రావు నర్సాపూర్ లో టిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి గత ఐదేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. నిధుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. అంతేకాకుండా తెలంగాణ ఎంపికి మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాక్కుని యావత్ తెలంగాణను అవమానించారని బిజెపిపై మండిపడ్డారు.

మెదక్ పార్లమెంట్ స్థానంలో గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఇచ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా లభించే పరిస్థితులు లేవన్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఓటమికి తక్కువ, డిపాజిట్ కు ఎక్కువ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతుకుదెరువు కోల్పోయిందని హరీష్ సెటైర్ వేశారు. టిఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమ పాలన సాగిస్తోందని, దాన్ని చూసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ వైపు నడుస్తున్నారని తెలిపారు. ఇప్పటికి దాదాపు ఖాళీ అయిపోయిన ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల తర్వాత ఉనికినే కోల్పోయే ప్రమాదంలో ఉందని హరీష్ తెలిపారు.

Harish Rao Slams Congress and BJP

Related Stories: